عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صلى الله عليه وسلم أنه قال:
«وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ إِلَّا كَانَ مِنْ أَصْحَابِ النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 153]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 153]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా కానీ వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశము చేరిన తరువాత దానిని విని కూడా, ఆ సందేశాన్ని విశ్వసించకుండా (ఇస్లాం ను స్వీకరించకుండా) చనిపోతే, నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసులలో ఒకడు అవుతాడు. నరకం లో అతడు శాశ్వతంగా పడిఉంటాడు.