وعن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: «أحْفُوا الشَّوَارِبَ وأَعْفُوا اللِّحَى».
[صحيح] - [متفق عليه، وهذا لفظ مسلم]
المزيــد ...

ఇబ్నె ఉమర రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియ జేశారు"మీసాలను కత్తిరించండి మరియు గడ్డాన్నివదిలేయండి(పెంచండి)"
దృఢమైనది - ముత్తఫఖున్ అలైహి మరియు పదాలు ముస్లింవి

వివరణ

హదీసు అర్ధం:ముస్లిములకు ఆదేశమేమనగా వారు తమ మీసాలను కత్తిరించాలి నలభై రోజులకు మించి వదలకూడదు,ముస్లిం రహిమహుల్లాహ్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖిస్తున్నారు :మీసాలు,గోర్లు,చంక,నాభి కింది వెంట్రుకలు కత్తిరించుటకు సమయాన్ని నిర్ణయిస్తూ ‘ మేము నలబై రోజులకు మించి వాటిని ’వదలకూడదని చెప్పారు,అబుదావూద్ ఉల్లేఖనం ప్రకారంగా-మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మా కొరకు ‘నాభి వెంట్రుకలు,గోర్లు,మీసాలు,కత్తిరించుటకు సమయాన్ని సూచిస్తూ నలబై రోజులకు మించి వదలకూడని చెప్పారు-అహ్మద్ మరియు నసాయి ఉల్లేఖనం ప్రకారం: మీసాలు కత్తిరించనివాడు మనలోనివాడు కాదు”-ఇమామ్ అల్బానీ ఈ హదీసును "c2">“సహీ అల్ జామిస్సగీర్ వజియాదతుహు”2/113 హదీసు నంబర్ 6533 ను ప్రామాణికమైనదిగా పేర్కున్నారు,అనగా మీసాలు కత్తిరించడం పై తాకీదు చేయబడింది,అది చర్మం తెలుపు కనిపించేలా కత్తిరించుకోవాలి లేదా పెదవులను దాటి వచ్చి భోజనానికి అంటుకునే మీసాలను కత్తిరించుకోవాలి." إعفاء اللحية "واللحية- వ్యాఖరణకర్తలు "c2">“లిహ్’యాతు”{ గడ్డం } అర్ధం వివరిస్తూ చెప్పారు : ముఖం మరియు దవడల మధ్య పెరిగే వెంట్రుకలు,అంటే బుగ్గలపై చెంపలపై వెలిసే వెంట్రుకలన్నీగడ్డం అవుతాయి, إعفاء'వదలడం’ అంటే దాన్ని దట్టంగా పెంచడం, పూర్తిగాకానీ లేదా చిన్నదిగాకానీ కత్తిరించకూడదు,ఎందుకంటే ఇఅఫా అనే పదం‘అధికం,దట్టం అనే అర్ధాన్ని ఇస్తుంది,కాబట్టి దాన్నిపెద్దదిగా పెంచాలి’దీని ఉద్దేశ్యం :గడ్డాన్ని విడిచిపెట్టాలి అధికంగా పెంచాలి,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నుండి ఎన్నో సహీ హదీసుల్లో వివిధ పదాలను ఉపయోగిస్తూ గడ్డం పెంచమని ఆదేశించబడినది,కొన్ని సార్లు "وفروا"అని మరి కొన్ని సార్లు "أرخوا" అని ఇంకొన్ని సార్లు "أعفوا" అని వచ్చింది,ఈ పదాలన్నీ కూడా గడ్డం యధావిధిగా వదిలేయాలని,దానిని పెంచాలని మరియు దానిని ఏమి చేయకూడదని తాకీదు చేస్తున్నాయి,ఫారస్ ప్రజలు అలవాటు ప్రకారం గడ్డం కత్తిరించేవారు,ఇస్లాం మాత్రం అలా కత్తిరించకూడదు అని వారించింది,బుఖారి గ్రంధం ప్రకారంగా ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం ఇలా ఉంది‘ముష్రిఖులకు వ్యతిరేఖత చూపండి”ముష్రికులకు వ్యతిరేఖత చూపడం తో పాటు గడ్డం పెంచడం వాజిబ్ అని సాక్ష్యాపరుస్తుంది,వ్యతిరేఖతకు అసలు కారణం హరామ్ అవ్వడం వల్లనే,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు : "ఇతరజాతులను అనుసరించువాడు అదే జాతికి చెందుతాడు”

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. గడ్డాన్ని కొరగడం లేదా కత్తిరించడం హరాము,దానిని పెంచడం విధి,మీసాలను అలాకాదు అది కత్తిరించబడుతుంది.
  2. మీసాలను కత్తిరించడం వాజిబ్ ఆదేశం,పెంచడానికి అనుమతించబడలేదు,అది పెదవుల మీదకు గాని లేదా పూర్తిచిన్నగా కత్తిరించాలి.