عن عائشة رضي الله عنها : أن النبي صلى الله عليه وسلم قال: «السِّواك مَطْهَرَةٌ للْفَم مَرْضَاةٌ لِلرَّبِّ».
[صحيح] - [رواه النسائي وأحمد والدارمي]
المزيــد ...

ఆయెషా రజియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం;మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు తెలిపారు ‘మిస్వాక్ చేయడం నోటికి శుభ్రతను,ప్రసాదిస్తుంది మరియు అల్లాహ్ యొక్క ప్రీతి ప్రాప్తిస్తుంది.
దృఢమైనది - దాన్ని నసాయీ ఉల్లేఖించారు

వివరణ

మిస్వాక్ నోటిని మురికి,దుర్వాసన మరియు నష్టం కలిగించే మొదలైన విషయాల నుండి రక్షణనిస్తుంది,నోటి శుభ్రతను చేకూర్చే ఏ వస్తువు ఉపయోగించిన మిస్వాక్ సున్నత్ పూర్తి అవుతుంది,ఉదా ఒక వ్యక్తి బ్రష్ మరియు పేస్ట్ ను దంతాల మురికిని దూరం చేయుటకు వినియోగించాడు అయితే నోటి మురికిని దూరం చేసే ఏ వస్తువు వాడిన సున్నత్ పూర్తి అవుతుంది,మిస్వాక్ అల్లాహ్ ప్రసన్నత ప్రాప్తికి తోడ్పడుతుంది,అనగా మిస్వాక్ వాడకం అల్లాహ్ దాసుని పట్ల ప్రసన్నత పొందే కారణాల్లో ఒకటి,పండితులు మిస్వాక్ చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ప్రస్తావించారు:ఇది నోటిని శుభ్రంగా ఉంచుతుంది,దంత చిగుర్లను దృఢంగా ఉంచుతుంది,కళ్ళకు కాంతిని చేకూరుస్తుంది,బల్గమ్ దూరం చేస్తుంది,దీని వల్ల సున్నత్ చేసినట్లు అవుతుంది,మిస్వాక్ వాడకం వల్ల అల్లాహ్ ప్రసన్నత మరియు దైవదూతల సంతోషం ప్రాప్తిస్తుంది,దీని వలన పుణ్యఫలాలు వృద్ది చెందుతాయి మరియు జీర్ణ వ్యవస్థ సరిచేస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నిశ్చయంగా మిస్వాక్ ‘నోటి శుభ్రతకు ఒక చక్కని మార్గం.
  2. మహోన్నతుడైన అల్లాహ్ పరిశుభ్రతను మరియు పరిశుభ్రంగా ఉండేవారిని ఇష్టపడతాడు,కాబట్టి పరిశుభ్రత ను జనుల కొరకు ఇస్లామీయ ఆదేశంగా మారుస్తూ తద్వారా అల్లాహ్ యొక్క ప్రీతి,ప్రసన్నతను పొందల్సిందిగా చెప్పడం జరిగింది.
  3. మిస్వాక్ యొక్క ఘనత
  4. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లామ్ వారు తమ (సమాజానికి జాతికి) ఉమ్మత్ కు మిస్వాక్ అధికంగా చేయాలని ప్రోత్సహించారు.
  5. ఉపవాసి కొరకు కూడా మిస్వాక్ వాడకం ధర్మబద్ధం చేయబడినది, అది ఉదయమైన సాయంత్రం వేళ అయినా సరే!
  6. దాసుడి కొరకు మిస్వాక్ వాడకం మహోన్నతుడైన అల్లాహ్ ప్రీతి ప్రసన్నతను పొందే మార్గాల్లో ఒకటి.
  7. ‘రిజా"- ‘రిజా’గుణము అల్లాహ్ కొరకు నిరూపించబడినది.