عن أبِي هريرة رضي اللَّه عنه: سمعتُ النبِيّ صلى الله عليه وسلم يقول:
«الفِطْرَةُ خمسٌ: الخِتَانُ والاستحدادُ وقصُّ الشَّارِبِ وتقليمُ الأظفارِ وَنَتْفُ الآبَاطِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5891]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను:
“మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5891]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మములోని ఐదు స్వాభావిక ఆచరణల గురించి తెలియ జేసినారు. ఇవి గతించిన ప్రవక్తల సున్నత్’లోని భాగముగా కూడా ఉండేవి.
వాటిలో మొదటిది: ‘అల్ ఖితాన్’ (సుంతీ) – అంటే పురుషులలో శిశ్నాగ్రమును కప్పుతూ వదులుగా ఉండే చర్మాన్ని కత్తిరించుట, అలాగే స్త్రీలలో సంభోగపు ప్రదేశానికి (యోనికి) పై భాగాన ఉండే యోని శీర్షాన్ని కత్తిరించుట.
రెండవది: ‘అల్’ఇస్తిహ్’దాద్’ – అంటే జననాంగాలపై మరియు జననాంగాల పరిసరాలలో మొలిచే వెంట్రుకలను తొలగించుట.
మూడవది: మీసాలను కత్తిరించుట (కురుచవిగా చేయుట).
నాలుగవది: గోళ్ళు కత్తిరించుట.
ఐదవది: చంకలలోని వెంట్రుకలు తొలగించుట.