+ -

عَنِ شُرَيْحٍ بنِ هانِئٍ قَالَ:
سَأَلْتُ عَائِشَةَ، قُلْتُ: بِأَيِّ شَيْءٍ كَانَ يَبْدَأُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ بَيْتَهُ؟ قَالَتْ: بِالسِّوَاكِ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 253]
المزيــد ...

షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన:
“నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 253]

వివరణ

రాత్రిపూటగానీ, లేక పగటి పూట గానీ, (బయటి నుండి వస్తే) ఇంటిలోనికి ప్రవేశించినపుడు ముందుగా సివాక్ ఉపయోగించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానము.

من فوائد الحديث

  1. సాధారణంగా అన్ని సమయాల్లో సివాక్ ఉపయోగించవచ్చు అనేది షరియత్’లో ఉన్న విషయమే, శాసనకర్త (అల్లాహ్) మిస్వాక్ ఉపయోగించుటకు సిఫారసు చేసిన సమయాలలో కొన్ని: ఇంటిలో ప్రవేశించినప్పుడు, నమాజు ఆచరించుట కొరకు ఉపక్రమించినపుడు; ఉదూ చేయునపుడు, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మరియు నోటి వాసన మారినపుడు (నోటి నుండి దుర్వాసన వస్తున్నట్లయితే).
  2. ఈ హదీథుద్వారా – ‘తాబియీలు’ (సహాబాల తరువాత తరం విశ్వాసులు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థితిగతులను గురించి, వారు అనుసరించిన విధానాలను గురించి తెలుసుకోవడం పట్ల అత్యంత ఆసక్తిగా ఉండేవారని తెలుస్తున్నది; తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్’లను అనుసరించేందుకు గాను.
  3. ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలోనికి ప్రవేశించినపుడు, ముందుగా ఏమి చేసేవారు అని ప్రశ్నించడం – ఏదైనా విషయాన్ని గురించిన ఙ్ఞానాన్ని ఆ విషయం గురించి బాగా తెలిసిన వారి నుండి, ఙ్ఞానవంతుల నుండి తీసుకోవాలి అనే విషయాన్ని తెలుపుతున్నది.
  4. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటుంబ సభ్యుల పట్ల ఎంత సభ్యతను కనపరిచేవారో, వారితో ఎంత స్నేహపూర్వకంగా మెలిగేవారో తెలియజేస్తున్నది; ఆయన (స) ఇంటిలోనికి ప్రవేశించినపుడు ముందుగా నోటిని శుభ్రపరుచుకునేవారు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి