عن عبد الله بن عمرو رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال:
«بَلِّغُوا عَنِّي وَلَوْ آيَةً، وَحَدِّثُوا عَنْ بَنِي إِسْرَائِيلَ وَلَا حَرَجَ، وَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3461]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]
దివ్య ఖుర్’ఆన్ నుంచైనా లేదా సున్నతుల నుంచి అయినా సరే (నేర్చుకున్న) ఙ్ఞానాన్ని ఇతరులకు చేర వేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు, అది కొద్దిపాటి ఙ్ఞానమైనా సరే, అంటే దివ్య ఖుర్’ఆన్ నుండి ఒక వాక్యమైనా లేక ఒక హదీసు అయినా సరే. అయితే నియమము ఏమిటంటే అతడు ఏమి చేరవేస్తున్నాడో లేదా దేని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తున్నాడో, దాని గురించి అతడు స్వయంగా పూర్తి ఙ్ఞానమూ, అవగాహనా కలిగి ఉండాలి. తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రాయీలు సంతతి వారినుంచి కూడా ఉల్లేఖించవచ్చని, అందులో అభ్యంతరము ఏమీ లేదని వివరించినారు. అంటే దాని అర్థము, వారికి ఏమి జరిగినది అనే విషయాలను గురించి. అయితే అవి (ఆ ఉల్లేఖనలు) మన షరియత్’కు వ్యతిరేకమైనవి కాకూడదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై అబద్దాలాడుట గురించి హెచ్చరించినారు మరియు ఎవరైతే తనపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో స్థిరపరుచుకున్నట్లే అని తెలిపినారు.