عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ وَالْمُغِيرَةِ بْنِ شُعْبَةَ رضي الله عنهما قَالَا: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ حَدَّثَ عَنِّي بِحَدِيثٍ يُرَى أَنَّهُ كَذِبٌ، فَهُوَ أَحَدُ الْكَاذِبِينَ».
[صحيح] - [رواه مسلم في مقدمته]
المزيــد ...
సమురా ఇబ్న్ జుందుబ్ మరియు ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”
[దృఢమైనది] - - [صحيح مسلم]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే తన పేరున ఒక హదీథును – అది అబద్ధం అని తెలిసీ, లేక అబద్ధపు హదీసేమో అనే కొద్దిపాటి అనుమానం ఉన్నా; లేక ఇది ఖచ్చితంగా అబద్ధపు హదీథే అనే బలమైన అనుమానం ఉండి కూడా దానిని ప్రచారం చేసినట్లైతే అతడు వాస్తవానికి దానిని ప్రారంభించిన వానితో కలిసి ఈ అబద్ధములో పాల్గొంటున్న వాడు అవుతాడు.