عَنْ بُسْرِ بْنِ سَعِيدٍ، أَنَّ زَيْدَ بْنَ خَالِدٍ الْجُهَنِيَّ رَضيَ اللهُ عنه، أَرْسَلَهُ إِلَى أَبِي جُهَيْمٍ رَضيَ اللهُ عنه، يَسْأَلُهُ مَاذَا سَمِعَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْمَارِّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي؟ قَالَ أَبُو جُهَيْمٍ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي مَاذَا عَلَيْهِ لَكَانَ أَنْ يَقِفَ أَرْبَعِينَ خَيْرًا لَهُ مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ» قَالَ أَبُو النَّضْرِ: لَا أَدْرِي قَالَ: أَرْبَعِينَ يَوْمًا أَوْ شَهْرًا أَوْ سَنَةً؟
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 507]
المزيــد ...
బుస్ర్ ఇబ్న్ సఈద్, తనను జైద్ ఇబ్న్ ఖాలిద్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు 'నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళే వ్యక్తికి సంబంధించి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమి విన్నారో తెలుసుకుని రమ్మని' అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు వద్దకు పంపినారు అని తెలిపినారు; అపుడు అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఎదురుగా నడిచి వెళ్ళుచున్న వ్యక్తికి తాను చేస్తున్నది ఎంత పెద్ద అపరాధమో తెలిస్తే, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే, అతడు నలభై వరకు అక్కడే నిలబడి ఉండడానికి ఇష్టపడతాడు, తప్ప అతని ముందు నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టపడడు”. అబూ అన్’నద్ర్ ఇలా అన్నారు: “అతడు నలభై రోజులు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా చెప్పలేను.”
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم - 507]
ఫర్జ్ లేదా నఫీల్ నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళరాదు అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉద్దేశపూర్వకంగా అలా చేసిన వ్యక్తి, దాని వలన తనకు కలిగే పాపం ఏమిటో తెలిస్తే, అతను నలభై అయినా అక్కడే నిలబడి ఉండడాన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే అది ఆ నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే అతనికి మంచిది”. ఈ హదీథు ఉల్లేఖకర్త అయిన అబూ నద్ర్ ఇలా అన్నారు: “ఆయన నలభై దినములు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా నాకు తెలియదు.”