+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا، وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 437]
المزيــد ...

అబూ హరైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు. వారు ముందుగా మస్జిద్‌కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 437]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు - ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజ్‌కు పిలుపు) మరియు మొదటి వరుసలో (నమాజులో) నిలబడడంలో ఉన్న గొప్ప పుణ్యం, ఫలితాన్ని నిజంగా తెలుసుకుంటే, దానిని పొందేందుకు ఎవరు ముందుగా హక్కు పొందాలో నిర్ణయించేందుకు లాటరీ వేసుకోవాల్సి వచ్చినా వారు అలా చేసేవారు. అలాగే, నమాజ్‌ను ప్రారంభ సమయంలోనే మస్జిద్‌కు రావడంలో ఉన్న ప్రతిఫలం తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. ఇంకా, ఇషా (రాత్రి) మరియు ఫజర్ (ఉదయం) నమాజుల్లో ఉన్న ప్రతిఫలం, పుణ్యం ఎంత గొప్పదో తెలుసుకుంటే, వారు నడవలేకపోయినా, చేతుల మీద నడుస్తూ అయినా ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు.

من فوائد الحديث

  1. అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) యొక్క గొప్పదనము స్పష్టం చేయబడింది.
  2. నమాజులో మొదటి వరుసలో నిలబడటం మరియు నమాజులో ఇమాం కు వీలైనంత సమీపంలో నిలబడటం యొక్క గొప్పతనము గురించి స్పష్టం చేయబడింది.
  3. నమాజు కోసం నిర్ణీతమైన సమయానికి ముందుగానే మస్జిదుకు చేరుకోవడం వలన లభించే గొప్ప ప్రతిఫలం మరియు దాని వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని: నమాజు కొరకు మొదటి వరుసలో నిలబడటం, నమాజులో ప్రారంభం నుండి పాల్గొనడం, స్వచ్ఛంద నమాజులు చేయడం, ఖుర్ఆన్ పఠించడం, దైవదూతలు వారి కోసం క్షమాపణ అడగడం మరియు నమాజు కోసం వేచి ఉన్నంత కాలం ఆరాధనలో ఉన్నట్లుగా పరిగణించబడటం మొదలైన అనేక విషయాలు ఉన్నాయి.
  4. ఈ రెండు నమాజుల కొరకు (ఫజ్ర్ మరియు ఇషా) సామూహికంగా హాజరు కావడానికి గొప్ప ప్రోత్సాహం, మరియు దానిలోని గొప్ప ప్రతిఫలం ఉంది, ఎందుకంటే అవి వ్యక్తికి కష్టాన్ని కలిగిస్తాయి, ఎందుకంటే అవి ఒకరి నిద్ర యొక్క ప్రారంభం మరియు ముగింపును పాడు చేస్తాయి మరియు ఈ కారణంగా అవి కపటులకు అత్యంత కష్టమైన నమాజులు.
  5. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: "ఈ హదీథు ద్వారా, హక్కులు లేదా వస్తువులపై (ముఖ్యంగా ధార్మిక ప్రయోజనాలైన) పోటీ మరియు వివాదాలు ఏర్పడినప్పుడు లాటరీ ద్వారా నిర్ణయించడం షరియతులో అంగీకరించబడిందని తెలుస్తుంది."
  6. నమాజు కొరకు రెండవ వరుస మూడవదానికంటే మెరుగ్గా ఉంది, మూడవది నాల్గవదానికంటే మెరుగ్గా ఉంది, ఇంకా అలాగే ఇతర వరుసలు.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా