+ -

قال سعد بن هشام بن عامر -عندما دخل على عائشة رضي الله عنها-:
يَا أُمَّ الْمُؤْمِنِينَ، أَنْبِئِينِي عَنْ خُلُقِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: أَلَسْتَ تَقْرَأُ الْقُرْآنَ؟ قُلْتُ: بَلَى، قَالَتْ: فَإِنَّ خُلُقَ نَبِيِّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ الْقُرْآنَ.

[صحيح] - [رواه مسلم في جملة حديثٍ طويلٍ] - [صحيح مسلم: 746]
المزيــد ...

సాద్ ఇబ్న్ హిషాం ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించాను:
“ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు

[దృఢమైనది] - - [صحيح مسلم - 746]

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజియల్లాహు అన్హా ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వమును గురించి చెప్పమని అడగడం జరిగింది. జవాబుగా ఆమె ఒక సమగ్రమైన పదాన్ని సూచించినారు. ప్రశ్నించిన వ్యక్తిని ఆమె, గుణగణాలన్నింటి సంపూర్ణత్వాన్ని కలిగిన పవిత్ర ఖుర్’ఆన్ వైపునకు మరలించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడి, నైతికత, శీలసంపద, వ్యక్తిత్వములను గురించి, ఆయిషా రజియల్లాహు అన్హా – వారు ఖుర్’ఆన్ యొక్క స్థిరప్రకృతి పై ఉన్నారని అన్నారు. ఖుర్’ఆన్ లో ఏమి ఆదేశించ బడినదో వారు దానిపై స్థిరంగా ఉండేవారు, అందులో ఏమి నిషేధించబడినదో వారు దానినుండి దూరంగా ఉండేవారు. వారి స్థిరప్రకృతి ఖుర్’ఆన్ ప్రకారం ఆచరించడమే అయి ఉండేది. ఖుర్’ఆన్ విధించిన హద్దులలో ఉండుట, సభ్యత, మర్యాదలలోఖుర్’ఆన్ ప్రకారం నడుచుకొనుట చేసేవారు. ఖుర్’ఆన్ లో తెలుపబడిన ఉదాహరణలు, ఉపమానాలు మరియు గాధలను అనుసరించడం పట్ల శ్రధ్ధ వహించేవారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Канада الولوف البلغارية Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో, పవిత్ర ఖుర్’ఆన్ బోధించే సభ్యత, సంస్కారాలు మరియు గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శముగా తీసుకుని వారిని అనుసరించాలనే హితబోధ ఉన్నది.
  2. అలాగే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంస్కారాల, గుణగణాల ప్రశంస ఉన్నది – అది వహీ (దివ్యావతరణ) అనే ప్రమిద నుంచి వచ్చే కాంతి వంటిది.
  3. అన్ని ఉత్కృష్ఠ నైతిక విలువలకు మూలము పవిత్ర ఖుర్’ఆన్.
  4. ఇస్లాంలో నైతిక విలువలు మరియు నైతికత అంటే పూర్తి ఇస్లాం ధర్మము – అంటే ఇస్లాం ధర్మము యొక్క ఆదేశాలను పాటించుట మరియు ధర్మం నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండుట.