عن عبد الله بن عمرو رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال:
«الرَّاحِمُونَ يَرْحَمُهمُ الرَّحمنُ، ارحَمُوا أهلَ الأرضِ يَرْحْمْكُم مَن في السّماء».
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4941]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 4941]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఎవరైతే ఇతరులపై కరుణ చూపుతారో, వారిని అనంత కరుణాప్రదాత, ప్రతిదాన్నిఆవరించి ఉన్న తన కరుణతో కరుణిస్తాడు – అది ఒక పరిపూర్ణ ప్రతిఫలం.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై కరుణ చూపమని ఆదేశిస్తున్నారు – మనుషులు, పశువులు, పక్షులు మరియు సృష్ఠిలోని ప్రతి జాతి సృష్ఠితాలు అన్నింటిపైనా. దానికి ప్రతిఫలం – ఆకాశాలపై ఉన్న అల్లాహ్ మీపై కరుణ చూపుతాడు.