عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«رَحِمَ اللهُ رَجُلًا سَمْحًا إِذَا بَاعَ، وَإِذَا اشْتَرَى، وَإِذَا اقْتَضَى».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2076]
المزيــد ...
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“కొనుగోలు చేసేటపుడు, అమ్మేటపుడు మరియు అప్పు తిరిగి ఇచ్చివేయమని అడిగేటపుడు మృదువుగా వ్యవహరించే వానిని అల్లాహ్ కరుణించుగాక”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 2076]
ఈ హదీసులో ఎవరైతే, అమ్మకాలు మరియు కొనుగోళ్ళలో (కఠినంగా కాకుండా) మృదువుగా వ్యవహరిస్తారో అటువంటి వారందరిపై అల్లాహ్ యొక్క కరుణ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించినారు. అలాగే కొనుగోలు చేయు వానితో, మూల్యము పట్ల కఠినంగా ఉండరాదు, అతడితో మంచిగా ప్రవర్తించాలి. కొనుగోలు చేయునపుడు ఉదారంగా, విశాల దృక్పథంతో వ్యవహరించండి. కొనుగోలు చేయు వస్తువులను తక్కువ చేసి మాట్లాడకండి మరియు వాటి మూల్యమును (అకారణంగా) తక్కువ చేయకండి. (ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే) తన అప్పును తీర్చమని అతని వద్దకు వెళ్ళి అడిగేటప్పుడు, అతడు పేదరికంలో ఉంటే లేదా అతడే మరొకరిపై ఆధారపడి జీవిస్తున్న వాడైతే, అతడితో (కఠినంగా కాకుండా) మృదువుగా వ్యవహరించండి, అతడు అప్పు తీర్చగల స్థితిలో ఉన్నాడో లేదో గమనించండి.