عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«رَغِمَ أَنْفُ، ثُمَّ رَغِمَ أَنْفُ، ثُمَّ رَغِمَ أَنْفُ»، قِيلَ: مَنْ؟ يَا رَسُولَ اللهِ قَالَ: «مَنْ أَدْرَكَ أَبَوَيْهِ عِنْدَ الْكِبَرِ، أَحَدَهُمَا أَوْ كِلَيْهِمَا فَلَمْ يَدْخُلِ الْجَنَّةَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2551]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2551]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపనార్థాలు పెట్టినట్లుగా అతడికి తలవంపులు కలగాలని, అతడు అవమానం పాలు కావాలని, ఎంతగా దుఆ చేసినారు అంటే, చివరికి వారి ముక్కు మట్టిలో పెట్టినంతగా. అక్కడ ఉన్న వారు “ఎవరు అతడు ఓ రసూలల్లాహ్, మీరు అంతగా అతనికి వ్యతిరేకంగా దుఆ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఎవరైతే తన తల్లిదండ్రులలో – ఒకరిని గానీ లేక ఇద్దరిని గానీ - తన జీవితములోనే వృద్ధాప్యానికి చేరుకోవడం చూస్తాడో, వారి పట్ల దయ, కరుణ కలిగి ఉండక, వారి పట్ల అవిధేయుడై ఉండి ఆ కారణంగా అతడు స్వర్గములోనికి ప్రవేశించలేడో – అతడు’ అన్నారు.