عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسِيرُ فِي طَرِيقِ مَكَّةَ، فَمَرَّ عَلَى جَبَلٍ يُقَالُ لَهُ جُمْدَانُ، فَقَالَ: «سِيرُوا هَذَا جُمْدَانُ، سَبَقَ الْمُفَرِّدُونَ» قَالُوا: وَمَا الْمُفَرِّدُونَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الذَّاكِرُونَ اللهَ كَثِيرًا وَالذَّاكِرَاتُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2676]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒకసారి, రసూలుల్లాల్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మక్కా నగరానికి వెళ్ళే దారిపై ప్రయాణిస్తుండగా, ‘జుమ్’దాన్’ అని పిలవబడే ఒక పర్వతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అపుడు ఆయన ఇలా అన్నారు: “కదలండి ముందుకు, ఇది ‘జుమ్’దాన్’ (పర్వతం); ‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు”. ఆయన వెంట ఉన్న వారు “ముఫర్రిదూన్ అంటే ఎవరు ఓ రసూలల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ఆయన: “అల్లాహ్’ను అధికంగా స్మరించే పురుషులు, మరియు అల్లాహ్’ను అధికంగా స్మరించే స్త్రీలు” అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2676]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను అధికంగా స్మరించే వారి స్థాయిని గురించి వివరించారు. వారు స్వర్గవనాలలో అత్యున్నత స్థానాలను పొందుటలో ఇతరుల కంటే ప్రత్యేకులు, మరియు ఇతరుల కంటే ముందుంటారు. ఆయన వారిని ‘జుమ్’దాన్’ పర్వతంతో పోల్చినారు, జుమ్’దాన్ పర్వతం మిగతా పర్వతాల కంటే ప్రత్యేకంగా, ఒంటరిగా, నిలబడి ఉంటుంది.