عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَعْقِدُ الشَّيْطَانُ عَلَى قَافِيَةِ رَأْسِ أَحَدِكُمْ إِذَا هُوَ نَامَ ثَلاَثَ عُقَدٍ يَضْرِبُ كُلَّ عُقْدَةٍ عَلَيْكَ لَيْلٌ طَوِيلٌ، فَارْقُدْ، فَإِنِ اسْتَيْقَظَ فَذَكَرَ اللَّهَ، انْحَلَّتْ عُقْدَةٌ، فَإِنْ تَوَضَّأَ انْحَلَّتْ عُقْدَةٌ، فَإِنْ صَلَّى انْحَلَّتْ عُقْدَةٌ، فَأَصْبَحَ نَشِيطًا طَيِّبَ النَّفْسِ، وَإِلَّا أَصْبَحَ خَبِيثَ النَّفْسِ كَسْلاَنَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1142]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1142]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి (తహజ్జుద్) నమాజు కొరకు, లేదా ఫజ్ర్ నమాజు కొరకు లేవాలి అనుకునే వ్యక్తిపై షైతాను చేసే దాడి గురించి తెలియజేస్తున్నారు.
ఒక విశ్వాసి నిద్రకు ఉపక్రమించినపుడు, షైతాను అతని మెడ భాగంలో మూడు ముడులు వేస్తాడు. మెడ భాగములో అంటే తలవెనుక భాగములో అని అర్థము
షైతాను గుసగుసలకు ప్రతిస్పందించక, విశ్వాసి నిద్ర నుండి మేల్కొని అల్లాహ్’ను స్మరించుకుంటే ఒక ముడి తొలగి పోతుంది.
అతడు ఉదూ చేసుకుంటే రెండవ ముడి తొలగిపోతుంది.
అతను లేచి నమాజు ఆచరిస్తే చేస్తే, మూడవ ముడి విడిపోతుంది. షైతాను వేసిన ముడుల కారణంగా అతడిని ఆవరించి ఉన్న నిరుత్సాహము తొలగి పోవడంతో, అతను చురుకుగా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటాడు, ఎందుకంటే అల్లాహ్ తనకు ప్రసాదించిన విధేయతతో అతను సంతోషంగా ఉన్నాడు గనుక, మరియు అల్లాహ్ అతనికి ప్రతిఫలం గురించి మరియు క్షమాపణ గురించి వాగ్దానం చేసిన దాని పట్ల ఆశాజనకంగా ఉన్నాడు గనుక.