عن عبد الله بن عمرو رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ الْمُقْسِطِينَ عِنْدَ اللهِ عَلَى مَنَابِرَ مِنْ نُورٍ، عَنْ يَمِينِ الرَّحْمَنِ عَزَّ وَجَلَّ، وَكِلْتَا يَدَيْهِ يَمِينٌ، الَّذِينَ يَعْدِلُونَ فِي حُكْمِهِمْ وَأَهْلِيهِمْ وَمَا وَلُوا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1827]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి చేతి వైపున కాంతితో చేయబడిన ఉన్నత ఆసనాలపై ఆశీనులై ఉంటారు. ఆయన రెండు చేతులు కూడా కుడి చేతులే. వారు (ఆ న్యాయవంతులు), తమ తీర్పులలో, తమ కుటుంబాల పట్ల మరియు తమ సంరక్షణలో ఉన్న వారి పట్ల న్యాయముతో వ్యవహరిస్తారు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1827]
ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే ప్రజల మధ్య సత్యము మరియు న్యాయము ఆధారంగా తీర్పు చేస్తారో అంటే ఎవరైతే తమ శాసనం క్రింద ఉన్నారో వారిపట్ల, ఎవరైతే తమ అధికారం క్రింద ఉన్నారో వారి పట్ల, వారి కుటుంబాల పట్ల న్యాయంగా వ్యవహరిస్తారో, వారు తీర్పు దినమునాడు తమ గౌరవార్థం కాంతితో తయారు చేయబడిన ఉన్నత ఆసనాలపై అశీనులవుతారు” అని తెలియజేస్తున్నారు. ఆ ఉన్నతాసనాలు అనంత కరుణామయుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ యొక్క కుడి చేతివైపు పొందుపరచబడి ఉంటాయి. పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క రెండు చేతులూ కుడి చేతులే.