عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ أَكَلَ ثُومًا أَوْ بَصَلًا، فَلْيَعْتَزِلْنَا -أَوْ قَالَ: فَلْيَعْتَزِلْ- مَسْجِدَنَا، وَلْيَقْعُدْ فِي بَيْتِهِ»، وَأَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أُتِيَ بِقِدْرٍ فِيهِ خَضِرَاتٌ مِنْ بُقُولٍ، فَوَجَدَ لَهَا رِيحًا، فَسَأَلَ فَأُخْبِرَ بِمَا فِيهَا مِنَ البُقُولِ، فَقَالَ قَرِّبُوهَا إِلَى بَعْضِ أَصْحَابِهِ كَانَ مَعَهُ، فَلَمَّا رَآهُ كَرِهَ أَكْلَهَا، قَالَ: «كُلْ فَإِنِّي أُنَاجِي مَنْ لاَ تُنَاجِي».
ولِمُسْلِمٍ عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَنْ أَكَلَ مِنْ هَذِهِ الْبَقْلَةِ، الثُّومِ - وقَالَ مَرَّةً: مَنْ أَكَلَ الْبَصَلَ وَالثُّومَ وَالْكُرَّاثَ فَلَا يَقْرَبَنَّ مَسْجِدَنَا، فَإِنَّ الْمَلَائِكَةَ تَتَأَذَّى مِمَّا يَتَأَذَّى مِنْهُ بَنُو آدَمَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 855]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 855]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లి తిన్నాడో అతడు మస్జిదుకు రారాదని నిషేధించినారు - అలా వాటిని తిని, దాని వాసన వస్తున్న నోటితో మస్జిదుకు వచ్చినట్లయితే, జమాఅత్’తో నమాజు చదవడానికి వచ్చిన తన సోదరులను ఇబ్బందికి గురిచేస్తాడు అనే ఉద్దేశ్యంతో. ఈ నిషేధాన్ని ‘తన్’జీహీ’ అంటారు; అంటే ఇది, వాటిని తిని వాసన వచ్చే నోటితో మస్జిదుకు రావడాన్ని మాత్రమే నిషేధిస్తున్నది, వాటిని తినడం నుండి కాదు; ఎందుకంటే అవి ‘హలాల్’ (షరియత్ అనుమతించిన) ఆహారపదార్థాలు. తరువాత కూరగాయలతో కూడిన ఒక కుండను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి తీసుకు రావడం జరిగింది. దాని నుండి వస్తున్న వాసనను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు దానిలో ఏమి ఉన్నదో తెలియజేయడం జరిగింది. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తినడానికి ఇష్టపడలేదు. వారు ఆ కుండను తనతోపాటు ఉన్న సహచరుల వైపునకు పంపినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుకరిస్తూ వారు కూడా దానిని తినడానికి అయిష్టత చూపినారు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు తినండి! ఎందుకంటే నేను వహీ తీసుకుని వచ్చే దైవదూతలతో సంభాషిస్తుంటాను”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు – దుర్వాసన వలన మనుషులకు ఏ విధంగానైతే ఇబ్బంది, హాని కలుగుతుందో, అదేవిధంగా దైవదూతలకు కూడా కలుగుతుంది.