عن أبي هريرة رضي الله عنه قال:
أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ أَعْمَى، فَقَالَ: يَا رَسُولَ اللهِ، إِنَّهُ لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى الْمَسْجِدِ، فَسَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُرَخِّصَ لَهُ فَيُصَلِّيَ فِي بَيْتِهِ، فَرَخَّصَ لَهُ، فَلَمَّا وَلَّى دَعَاهُ، فَقَالَ: «هَلْ تَسْمَعُ النِّدَاءَ بِالصَّلَاةِ؟» فَقَالَ: نَعَمْ، قَالَ: «فَأَجِبْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 653]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నన్ను మస్జిదుకు తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరు” అని, తన ఇంటిలోనే నమాజు ఆచరించుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని వెనుకకు పిలిచి “నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 653]
అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు సహాయం చేయడానికి గానీ, ప్రతిరోజూ ఐదు పూటల నమాజు కొరకు నా చేయి పట్టుకుని మస్జిదునకు తీసుకు వచ్చే వారెవ్వరూ లేరు” అని జమాఅత్ ను వదలడానికి (తన ఇంటిలోనే నమాజు ఆచరించడానికి) ఆయన అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. అతడు వెనుతిరగగా ఆయన అతనితో “సలాహ్ కొరకు ఇవ్వబడే అదాన్ ను నీవు వినగలవా?” అని ప్రశ్నించారు. అతడు “అవును, వినగలను” అని జవాబిచ్చినాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు (అంటే మస్జిదుకు వచ్చి జమాతుతో నమాజు ఆచరించు)” అన్నారు.