عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا، وَشَرُّهَا آخِرُهَا، وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا، وَشَرُّهَا أَوَّلُهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 440]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 440]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నమాజులో పురుషులకొరకు శ్రేష్ఠమైన పంక్తులు, అత్యధిక ప్రతిఫలం, పుణ్యఫలం మరియు ఘనత కలిగిన పంక్తులు – మొదటి పంక్తులు. ఎందుకంటే ఇవి ఇమామ్’కు దగ్గరగా ఉంటాయి మరియు ఆయన పఠనాన్ని ఈ పంక్తులు శ్రధ్ధగా వింటాయి మరియు స్త్రీలకు దూరంగా ఉంటాయి కనుక. మరియు అధమమైన వరుసలు, తక్కువ ప్రతిఫలం మరియు తక్కువ ఘనత కలిగిన వరుసలు మరియు (నమాజుకు సంబంధించి) షరియత్ ద్వారా అవసరమైన వాటికి దూరంగా ఉండే వరుసలు చివరి వరుసలు. మహిళలకు ఉత్తమమైన వరుసలు చివరివి, ఎందుకంటే చివరి వరుసలు మహిళలకు ఎక్కువ పరదాను కలుగజేస్తాయి, పురుషులతో కలవకుండా, వారికి దూరంగా, వారిని చూడకుండా మరియు వారి కారణంగా మనోవికారం వంటి వాటికి గురి కాకుండా చేస్తాయి. అలాగే మహిళల కొరకు అధమమైన వరుసలు మొదటి వరుసలు, ఎందుకంటే మొదటి వరుసలు పురుషులకు సమీపంగా ఉంటాయి, మరియు ఆ కారణంగా స్త్రీల హృదయాలు ప్రలోభానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.