+ -

عَن أَبِي بُرْدَةَ بْنِ أَبِي مُوسَى رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
وَجِعَ أَبُو مُوسَى وَجَعًا شَدِيدًا، فَغُشِيَ عَلَيْهِ وَرَأْسُهُ فِي حَجْرِ امْرَأَةٍ مِنْ أَهْلِهِ، فَلَمْ يَسْتَطِعْ أَنْ يَرُدَّ عَلَيْهَا شَيْئًا، فَلَمَّا أَفَاقَ، قَالَ: أَنَا بَرِيءٌ مِمَّنْ بَرِئَ مِنْهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَرِئَ مِنَ الصَّالِقَةِ وَالحَالِقَةِ وَالشَّاقَّةِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1296]
المزيــد ...

అబూ బుర్'దహ్ బిన్ అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
అబూ మూసా తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉండగా అతను స్పృహ కోల్పోయారు. మరియు అతను ఆమెకు ఏ విధంగానూ (ఆమె పెడబొబ్బలకు నిస్పృహ వలన) స్పందించలేకపోయారు. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత, అతను ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నుండి అయితే తనను తాను వేరు చేసుకున్నారో, వారి నుండి నన్ను నేను వేరు చేసుకుంటున్నాను. నిశ్చయంగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సాలిఖా (జనాజాపై పెద్దగా పెడబొబ్బలు పెడుతూ విలపించే స్త్రీ), హాలిఖా (తలజుట్టు గొరిగించుకునే స్త్రీ) మరియు షక్కా (దుఃఖంలో దుస్తులు చింపుకునే స్త్రీ) లను తిరస్కరించారు.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1296]

వివరణ

అబూ బుర్దా రదియల్లాహు అన్హు తన తండ్రి అబూ మూసా అల్-అష్’అరి రదియల్లాహు అన్హు తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయారని, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉందని, అపుడు ఆమె బిగ్గరగా అరుస్తూ విలపించిందని, కానీ అతను స్పృహలో లేకపోవడం వలన ఆమెకు స్పందించ లేకపోయారని (నివారించలేకపోయారని) తెలిపినారు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నుండి అయితే తనను తాను వేరు చేసుకున్నారో, అతను రదియల్లాహు అన్హు కూడా తనను తాను వారి నుండి వేరు చేసుకుంటన్నానని పలికినారు: అస్సాలిఖహ్: విపత్తు, దుఃఖంపై విలపిస్తూ తన స్వరాన్ని పెంచే స్త్రీ అంటే పెడబొబ్బలు పెడుతూ బిగ్గరగా ఏడ్చే స్త్రీ. అల్' హాలిఖా: విపత్తు, దుఃఖంపై తన తలజుట్టును గొరిగించుకునే స్త్రీ. అల్'షఖ్ఖహ్: విపత్తు, దుఃఖంపై తన వస్త్రాన్ని చింపుకునే స్త్రీ. ఎందుకంటే అలాంటి విలపించే అలవాట్లు ఇస్లాంకు పూర్వం గడిచిన అజ్ఞాన కాలం యొక్క ఆచారాల నుండి వచ్చాయి. బదులుగా, విపత్తు సమయాల్లో ఓపికగా ఉండాలని మరియు అందుకు గాను అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరాలని ఆదేశించబడింది.

من فوائد الحديث

  1. విపత్తులు, ఆపదలు సంభవించినప్పుడు ఆ దుఃఖంలో బట్టలు చింపుకోవడం, తలజుట్టు గొరిగించుకోవడం పెడబొబ్బలు పెడుతూ బిగ్గరగా విలపించడం నిషేధించబడ్డాయి మరియు నిశ్చయంగా అలాంటి చర్యలు పెద్ద పాపాలుగా పరిగణించ బడినాయి.
  2. పెడబొబ్బలు పెట్టకుండా మరియు స్వరం పెంచకుండా దుఃఖించడం మరియు లోలోన ఏడవడం నిషేధించబడలేదు, ఎందుకంటే అవి అల్లాహ్ ఆజ్ఞలలో సహనానికి విరుద్ధంగా లేవు; బదులుగా, అవి దయ యొక్క రూపాలలో ఒక రూపం.
  3. బాధాకరమైన అంటే మనకు బాధ కలిగించే అల్లాహ్ ఆజ్ఞలపై మాటల ద్వారా లేదా చేతల ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేయడం నిషేధించబడింది.
  4. ఆపద, విపత్తు, దుఃఖ సమయంలో ఓర్పు తప్పనిసరి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా