عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «من يُرِدِ الله به خيرا يُصِبْ مِنه».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు‘మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియజేశారు ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతన్ని(అనారోగ్యానికి ,ఆపదలకు గురిచేసి)పరీక్షిస్తాడు’.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

అల్లాహ్ తన దాసుడి పట్ల మేలును కోరినప్పుడు అతన్ని ప్రాణ,ధననష్టానికి మరియు సంతానాన్ని ఆపదకు గురిచేసి పరీక్షిస్తాడు,అది అతని పాపాలు తొలగిపోవడానికి,అతని అంతస్తులు పెరగడానికి కారణమవుతుంది,ఒక వివేకవంతుడు పరీక్షకు గురైనప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు తద్వారా అవి అతనికి ప్రాపంచికపరంగా మరియు పరలోకపరంగా మేలు చేకూరుస్తాయని భావిస్తాడు,ప్రాపంచిక పరంగా మేలు అంటే అతను ఆ ఆపద సమయంలో అల్లాహ్ వైపుకు దుఆ చేస్తూ,బలహీనతను వ్యక్తపరుస్తూ తన అవసరాలను తెలుపుకుంటూ మరలుతాడు,పరలోక మేలు అంటే పాపాలు క్షమించబడతాయి మరియు స్థానాలు వృద్దిచెందుతాయి قال تعالى: (وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ)."c2">“-మేము ఏదో ఒకవిధంగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాము భయంతో ఆకలిదప్పులతో ధన ప్రాణాల నష్టం తో పండ్ల కొరతతో పరీక్షిస్తాము,ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి-”ఇతర హదీసులలో చూపిన అర్ధం ద్వారా ఈ హదీసును పరిమితం చేయబడినది,ఇతర హదీసుల ప్రకారంగా : అల్లాహ్ ఎవరిపట్ల మేలును కోరుకుంటాడో ‘అతను సహనం పాటిస్తాడు,పుణ్యఫలాన్నికాంక్షిస్తాడు,అల్లాహ్ అతన్ని ఆపదలకు గురిచేసి తద్వారా అతన్ని పరీక్షిస్తాడు,ఒకవేళ అతను ఓర్పువహించకపోతే,అనేక రకాలైన ఆపదలకు అతను గురవుతాడు అందులో ఎలాంటి మేలు ఉండదు,ఎందుకంటే అల్లాహ్ అతని పట్ల మేలును కోరుకోలేదు,అయితే కుఫ్ఫారులు ఎన్నో రకాల ఆపదలకు గురిచేయబడతారు,అయినప్పటికి కుఫ్ర్ పై ఉంటూ చివరికి దానిపై మరణిస్తారు,నిస్సందేహంగా అల్లాహ్ వీరిపట్ల ఎలాంటి మేలును కోరుకోలేదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నిశ్చయంగా ఒక విశ్వాసి రకరకాలైన పరీక్షలకు గురవుతాడు,అది ధర్మానికి చెందినది కావచ్చు లేదా ధనానికి సంభందించినది కావచ్చు.
  2. ఒక ముస్లిము కొరకు. ఇందులో గొప్ప శుభవార్త ఉంది ఎందుకంటే ఏ ముస్లిం భాధకు గురవ్వకుండా ఉండడు.
  3. పరీక్ష అనేది అల్లాహ్ కు దాసుడి పట్ల గల ప్రేమకు ఒక చిహ్నం తద్వారా అతని అంతస్తును పెంచుతాడు స్థానాన్నివృద్దిపరుస్తాడు అతని పాపాలను క్షమిస్తాడు.
ఇంకా