عَنْ مَطَرِ بْنِ عُكَامِسٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا قَضَى اللَّهُ لِعَبْدٍ أَنْ يَمُوتَ بِأَرْضٍ جَعَلَ لَهُ إِلَيْهَا حَاجَةً».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2146]
المزيــد ...
మతర్ ఇబ్న్ ఉకామిస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”.
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 2146]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ అల్లాహ్, తన దాసులలో ఎవరినైనా, భూమిపై ఫలానా ప్రదేశములో చనిపోతాడు, అని నిర్ణయించి ఉంటే, విధివ్రాతలో రాసి ఉంటే, ఆ దాసుడు అక్కడ నివసిస్తున్న వాడు కాకపోయినా, అతడు అక్కడి వెళ్ళే ఒక అవసరాన్ని (ఒక కారణాన్ని) ఏర్పరుస్తాడు. అప్పుడు అతని ఆత్మ అక్కడ (ఆ ప్రదేశములో) తీయబడుతుంది.