عَنْ ‌أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِعَمِّهِ: «قُلْ: لَا إِلَهَ إِلَّا اللهُ، أَشْهَدُ لَكَ بِهَا يَوْمَ الْقِيَامَةِ»، قَالَ: لَوْلَا أَنْ تُعَيِّرَنِي قُرَيْشٌ، يَقُولُونَ: إِنَّمَا حَمَلَهُ عَلَى ذَلِكَ الْجَزَعُ لَأَقْرَرْتُ بِهَا عَيْنَكَ. فَأَنْزَلَ اللهُ: {إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ } [القصص: 56].

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న తో ఇలా అన్నారు "c2">“ (ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను”. దానికి ఆయన ఇలా అన్నాడు "c2">“(ఎదురుగా నిలబడిన) మృత్యువు భయం నేను అలా చేసేలా ప్రేరేపించింది అని ఖురైషీయులు నన్ను నిందిస్తారనే (అవమానిస్తారనే) భయం గానీ లేక పోతే, నిశ్చయంగా దానితో (ఆ పదాలతో) నీ కళ్ళకు ఆనందం, సంతోషం కలిగించేవాడిని”
. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింప జేసినాడు { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్‌ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందేవారెవరో బాగా తెలుసు} (సూరహ్ అల్ ఖసస్ 28:56)
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న అయిన అబూ తాలిబ్ మరణయాతనలో (మంచంపై చివరిఘడియలో) ఉన్న స్థితిలో ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు’ అని పలకమని, తీర్పు దినమున అతని కొరకు సిఫారసు చేస్తానని, మరియు ఆయన ఇస్లాం స్వీకరణకు తాను సాక్షిగా ఉంటానని కోరినారు. కానీ ఆయన షహాదహ్ పఠించడానికి నిరాకరించినాడు. ఖురైషీయులు తనను అవమానిస్తారనే భయంతో మరియు తనను గురించి "c2">“మృత్యువు భయంతో మరియు బలహీనత కారణంగా అతడు ముస్లింగా మారినాడు” అని అంటారనే భయంతో. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆయన ఇలా అన్నారు "c2">“ఈ భయం కారణంగా కాకపోతే నేను షహాదహ్ పలికి నీ హృదయానికి సంతోషం కలించే వాడినే. నీవు సంతృప్తి చెందే వరకూ (షహాదహ్ పలుకుతూ) నీ కోరిక తీర్చేవాడినే”. అప్పుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఆ ఆయతును అవతరింపజేసినాడు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ఇష్టమైన వారికి ఇస్లాం ప్రసాదించే హక్కు లేదని. కేవలం అల్లాహ్ మాత్రమే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు బోధనల ద్వారా, వివరించడం ద్వారా వారికి ‘అల్ సిరాత్ అల్ ముస్తఖీమ్’ (ఋజుమార్గం) వైపునకు మార్గదర్శకం చేస్తాడని తెలియజేసినాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రజలు ఏమంటారో అనే భయంతో ఎన్నడూ సత్యాన్ని త్యజించరాదు.
  2. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గం వైపునకు ప్రజలకు మార్గదర్శకం చేయగలిగే సాక్ష్యాలు, బోధనలు, వివరణలు కలిగి ఉన్నారు, అంతే కానీ వారికి సాఫల్యం ప్రసాదించలేరని తెలుస్తున్నది.
  3. ఇందులో వ్యాధిగ్రస్తులై ఉన్న అవిశ్వాసులను పలుకరించడానికి, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించడానికి వారిని కలువ వచ్చునని, వారి వద్దకు వెళ్ళవచ్చునని తెలుస్తున్నది.
  4. అన్ని పరిస్థితులలోనూ ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ చురుకుగా, ఎక్కువ ఆసక్తిగా ఉండేవారని తెలుస్తున్నది.
ఇంకా