+ -

عَنِ البَرَاءِ بْنِ عَازِبٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«المُسْلِمُ إِذَا سُئِلَ فِي القَبْرِ: يَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ»، فَذَلِكَ قَوْلُهُ: {يُثَبِّتُ اللَّهُ الَّذِينَ آمَنُوا بِالقَوْلِ الثَّابِتِ فِي الحَيَاةِ الدُّنْيَا وَفِي الآخِرَةِ} [إبراهيم: 27].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4699]
المزيــد ...

బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు. ఇది ఖుర్’ఆన్ లో అల్లాహ్ వాక్కు యొక్క వివరణ: “యుథబ్బితు ల్లాహుల్లదీన ఆమనూ బిల్’ఖౌలి థ్థాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ దృఢంగా ఉంచుతాడు.”]

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4699]

వివరణ

చనిపోయిన తరువాత విశ్వాసి సమాధిలో ప్రశ్నించబడతాడు; అతడిని ఇద్దరు దైవదూతలు ప్రశ్నిస్తారు. చాలా హదీసులలో పేర్కొనబడిన విధంగా వారి పేర్లు ‘మున్కర్’ మరియు ‘నకీర్’. అపుడు విశ్వాసి “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలల్లహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇది అల్లాహ్ (ఖుర్’ఆన్ లో) చేసిన దృఢమైన ప్రకటన: “యుసబ్బితు ల్లాహుల్లజీన ఆమనూ బిల్’ఖౌలిస్సాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలో మరియు పరలోకంలో దృఢంగా ఉంచుతాడు.”]

من فوائد الحديث

  1. సమాధిలో ప్రశ్నించబడుట అనేది సత్యము.
  2. ఇహలోకంలో మరియు పరలోకంలో తన విశ్వాసులైన దాసులపై అల్లాహ్ అనుగ్రహం; ఎందుకంటే విశ్వాసి సమాధిలో ఇచ్చే సమాధానాన్ని (ఖుర్’ఆన్ లో) చేసిన దృఢమైన ప్రకటనతో పోలుస్తున్నాడు.
  3. ఇందులో ‘తౌహీద్’ (అల్లాహ్ యొక్క ఏకత్వం) పట్ల సాక్ష్యమివ్వడం, మరియు అదే స్థితిలో మరణించడం యొక్క ఘనత తెలియుచున్నది.
  4. అల్లాహ్ ఇహలోకంలో విశ్వాసిని తన విశ్వాసముపై (ఇస్లాం పై) మరియు ఋజుమార్గముపై స్థిరపరుస్తాడు; మరణంలో అతడిని ‘తౌహీద్’ పై స్థిరంగా ఉండేలా, మరియు సమాధిలో దైవదూతలు ప్రశ్నించినపుడు అందులోనూ స్థిరంగా ఉండేలా చేస్తాడు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية الموري Малагашӣ Урумӣ Канада الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా