+ -

عَنِ ابْنِ عُمَرَ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أُمِرْتُ أَنْ أُقَاتِلَ النَّاسَ حَتَّى يَشْهَدُوا أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَيُقِيمُوا الصَّلاَةَ، وَيُؤْتُوا الزَّكَاةَ، فَإِذَا فَعَلُوا ذَلِكَ عَصَمُوا مِنِّي دِمَاءَهُمْ وَأَمْوَالَهُمْ إِلَّا بِحَقِّ الإِسْلاَمِ، وَحِسَابُهُمْ عَلَى اللَّهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 25]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాతు చెల్లించే వరకు ప్రజలతో పోరాడమని నేను ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు అలా చేస్తే వారు తమ రక్తాన్ని (ప్రాణాన్ని) మరియు తమ సంపదలను నా నుంచి రక్షించుకున్నట్లే; ఇస్లామీయ చట్టాల ద్వారా (మరణ శిక్ష విధించబడితే) తప్ప.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 25]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: అవిశ్వాసులు మరియు విగ్రహారాధకులతో - వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయన అద్వితీయుడూ, ఏకైకుడు అని ఆయనకు సాటి ఎవరూ లేరు అని; మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యము పలికి, ఆ పలికిన సాక్ష్యానికి అనుగుణంగా దినము మరియు రాత్రిలో (విధిగావించబడిన) ఐదు నమాజులను ఆచరిస్తూ, అర్హులైన వారికి జకాతు చెల్లించనంత వరకు – వారితో పోరాడమని ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు వీటిని ఆచరించినట్లయితే, ఇస్లాం వారి రక్తాన్ని (వారి ప్రాణాలను), వారి సంపదలను రక్షిస్తుంది. కనుక, ఇస్లాం ఆదేశాల ప్రకారం మరణ శిక్ష విధించబడే నేరం ఏదైనా చేస్తే తప్ప వారి ప్రాణాలను తీయడం నిషేధము. తరువాత తీర్పు దినమునాడు అల్లాహ్ వారి లెక్కా పత్రము తీసుకుంటాడు; ఎందుకంటే వారి అంతరంగములో ఏమి ఉన్నదో ఆయనకు తెలుసు గనుక.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఆదేశాలు, నియమాలు బాహ్యంగా కనిపించే విషయాలకు మాత్రమే వర్తిస్తాయి; అంతరంగములో ఉన్న రహస్యాలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు.
  2. ఇందులో ప్రజలను ‘తౌహీదు’ వైపునకు ఆహ్వానించుట యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది. ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించునపుడు ఈ విషయమే అన్నింటికన్నా ముందు ఉండాలి .
  3. ఈ హదీసు యొక్క భావము - అవిశ్వాసులు మరియు విగ్రహారాధకులతో బలవంతంగానైనా ఇస్లాం స్వీకరింపజేయాలని కాదు. వారికి రెండు వికల్పాలను ఇవ్వడమే ఉద్దేశ్యం – ఇస్లాం స్వీకరించండి, లేదా (మీ రక్షణ కొరకు) పన్ను చెల్లించండి అని. ఒకవేళ వారు నిరాకరించి, ఇస్లాం సందేశాన్ని అడ్డుకున్నట్లయితే; అపుడు (యుద్ధానికి సంబంధించి) ఇస్లామీయ ఆదేశాలు, నియమాలను పాటిస్తూ వారితో యుద్ధం చేయడం జరుగుతుంది.
ఇంకా