عَنْ وَحْشِيِّ بْنِ حَرْبٍ رَضيَ اللهُ عنه:
أَنَّهُمْ قَالُوا: يَا رَسُولَ اللَّهِ، إِنَّا نَأْكُلُ وَلَا نَشْبَعُ، قَالَ: «فَلَعَلَّكُمْ تَأْكُلُونَ مُتَفَرِّقِينَ؟» قَالُوا: نَعَمْ. قَالَ: «فَاجْتَمِعُوا عَلَى طَعَامِكُمْ، وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ، يُبَارَكْ لَكُمْ فِيهِ».

[حسن] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن ابن ماجه: 3764]
المزيــد ...

వహ్’షియ్యిబ్ని హర్బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము తింటున్నాము కానీ కడుపు నిండినట్లు ఉండడం లేదు.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు?” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు:“కలిసి భోజనం చేయండి, ఆహారంపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అందులో మీకు శుభం కలుగుతుంది.”

[హసన్ హదీథు] - [అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ ఇబ్న్ మాజహ్ - 3764]

వివరణ

కొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో: “ఓ ప్రవక్తా! సల్లల్లాహు అలైహి వసల్లం. మేము తింటున్నాము కానీ ఎప్పుడూ కడుపు నిండినట్లు అనిపించటం లేదు” అన్నారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారేమో, ఎవరికి వారు ఒంటరిగా తింటున్నారేమో.” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విడివిడిగా, ఒంటరిగా కాకుండా, మీరంతా సమిష్ఠిగా ఒకచోట చేరి భోజనం చేయండి. ఆహారంపై “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామమున ప్రారంభిస్తున్నాము) అని అల్లాహ్ పేరును స్మరించండి. ఆ ఆహారం మీ కొరకు దీవించబడి, శుభప్రదం అవుతుంది, మరియు దానితో మీరు సంతుష్ఠులౌతారు” అన్నారు.

من فوائد الحديث

  1. భోజనం కోసం కలిసి సమావేశమై, భోజనం చేసేటప్పుడు బిస్మిల్లాహ్ పఠించడం వలన ఆహారం శుభప్రదమవుతుంది మరియు దానిని తినడం వల్ల సంతృప్తి కలుగుతుంది.
  2. విభజన పూర్తిగా చెడ్డది, ఐక్యత పూర్తిగా మంచిది.
  3. ఇందులో ఐక్యత పట్ల ప్రోత్సాహం మరియు ఆహారం భుజించడానికి ముందు అల్లాహ్ నామ స్మరణ పట్ల సూచన ఉన్నాయి.
  4. అల్ సిందీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "ఐక్యత ద్వారా ఆహారం శుభప్రదమవుతుంది మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామమును స్మరించడం షైతాను ఆ ఆహారాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది."
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (34)
ఇంకా