عَنْ أَبِي حَازِمٍ قَالَ: قَاعَدْتُ أَبَا هُرَيْرَةَ رضي الله عنه خَمْسَ سِنِينَ، فَسَمِعْتُهُ يُحَدِّثُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«كَانَتْ بَنُو إِسْرَائِيلَ تَسُوسُهُمُ الأَنْبِيَاءُ، كُلَّمَا هَلَكَ نَبِيٌّ خَلَفَهُ نَبِيٌّ، وَإِنَّهُ لاَ نَبِيَّ بَعْدِي، وَسَيَكُونُ خُلَفَاءُ فَيَكْثُرُونَ» قَالُوا: فَمَا تَأْمُرُنَا؟ قَالَ: «فُوا بِبَيْعَةِ الأَوَّلِ فَالأَوَّلِ، أَعْطُوهُمْ حَقَّهُمْ، فَإِنَّ اللَّهَ سَائِلُهُمْ عَمَّا اسْتَرْعَاهُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3455]
المزيــد ...
అబూ హాజిమ్ ఇలా పలికినారు: నేను అబూ హురైరహ్ రదియల్లాహు అన్హుతో ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాను, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అతను ఇలా ఉల్లేఖించడం నేను విన్నాను:
ఇస్రాయీలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. ఒక ప్రవక్త మరణించినప్పుడు, మరొక ప్రవక్త అతని స్థానంలో వచ్చేవారు. నిశ్చయంగా, నా తరువాత ఏ ప్రవక్తా రాడు, కానీ అనేకమంది ఖలీఫాలు (పాలకులు) ఉంటారు." దానికి వారు ఇలా అడిగారు: "అపుడు మేము ఏమి చేయాలి అని మీ ఆదేశం?" దానికి ఆయన ﷺ ఇలా అన్నారు: "మొదటివారికి (ఖలీఫాకు) బైఅత్ (విశ్వాస ప్రతిజ్ఞ) చేయండి, తరువాత వారికీ (వచ్చిన ఖలీఫాకూ) చేయండి. వారికి వారి హక్కులను ఇవ్వండి. ఎందుకంటే, అల్లాహ్ వారికి అప్పగించిన బాధ్యత గురించి వారిని ప్రశ్నించనున్నాడు."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3455]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: "ఇస్రాయేలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. వారు ప్రజల వ్యవహారాలను పాలకుల్లా నిర్వహించేవారు. ప్రతిసారి ప్రజల మధ్య అవినీతి (దుష్టత) ఏర్పడినప్పుడు, అల్లాహ్ వారి విషయాలను సరిదిద్దడానికి, ధార్మిక ఆదేశాలలో వారు చేసిన మార్పులు చేర్పులను తొలగించడానికి మరో ప్రవక్తను పంపేవాడు. నా తరువాత ఇక ప్రవక్తలు ఉండరు. నా తరువాత ఖలీఫాలు (పాలకులు) ఉంటారు, వారు ఒకరి కంటే ఎక్కువమంది అవుతారు. వారి మధ్య విభేదాలు, కలహాలు కలుగుతాయి. దానికి సహాబాలు ఇలా అడిగారు: "అపుడు ఏమి చేయమని మీరు మాకు ఆదేశిస్తున్నారు?" దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ఖలీఫాకు బైఅత్ (ప్రతిజ్ఞ) చేసిన తరువాత, మరొక ఖలీఫాకు కూడా బైఅత్ చేయబడితే, మొదటి ఖలీఫాకు చేసిన బైఅత్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది; రెండవదాన్ని చేయడం అనుచితం, అతడు దాన్ని కోరడం కూడా నిషిద్ధం. పాలకులకు వారి హక్కులను ఇవ్వండి, వారికి విధేయులుగా ఉండండి, అల్లాహ్‌కు అవిధేయత కలిగించే విషయాలలో తప్ప, మిగతా విషయాల్లో వారిని అనుసరించండి. ఎందుకంటే, అల్లాహ్ వారికి అప్పగించిన బాధ్యత గురించి వారిని ప్రశ్నిస్తాడు, వారి చర్యలకు వారిని బాధ్యత వహింపజేస్తాడు."