عَنْ جَرِيرٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ يُحْرَمِ الرِّفْقَ يُحْرَمِ الْخَيْرَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2592]
المزيــد ...
జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2592]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: "ఎవరైతే సున్నితత్వాన్ని కోల్పోతాడో, ధార్మిక జీవితంలోనూ, ఈ ప్రాపంచిక జీవితంలోనూ విజయం సాధించలేడు – అది తన స్వయం కొరకు చేసే పనుల్లో అయినా సరే, ఇతరులతో కలిసి చేసే పనుల్లోనైనా సరే, లేక ఇతరుల కొరకు చేసే పనుల్లోనైనాసరే. అలాంటి వ్యక్తికి ఎలాంటి మేలు లభించదు.