+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْعَشْرُ أَحْيَا اللَّيْلَ، وَأَيْقَظَ أَهْلَهُ، وَجَدَّ وَشَدَّ الْمِئْزَرَ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1174]
المزيــد ...

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1174]

వివరణ

రమదాన్ చివరి పది రోజులు ప్రారంభమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా అనేక విధాలుగా అల్లాహ్‌కు విధేయత చూపుతూ గడిపేవారు. ఆయన తన కుటుంబాన్ని కూడా లేపి నమాజు చేయించేవారు. సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింతగా ఎక్కువగా శ్రమించేవారు. తాను పూర్తిగా ఆరాధనలలో నిమగ్నమై, తన భార్యలతో సన్నిహిత సంబంధాన్ని కూడా నివారించేవారు.

من فوائد الحديث

  1. శుభసమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్కార్యాలు అధికంగా చేయాలని ప్రోత్సహించబడింది.
  2. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: ఈ హదీథు ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే - రమదాన్ చివరి పది రోజుల్లో ఆరాధనలో మరింత ఎక్కువగా శ్రమించమని ముస్లింలకు సిఫార్సు చేయబడింది. అలాగే, ఆ రాత్రులను ఆరాధనలలో (నమాజు, ఖుర్ఆన్ పఠనం, దిక్ర్ మొదలైనవి) మేల్కొని గడపడం కూడా సిఫార్సు చేయబడింది.
  3. తన కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి పట్ల ప్రతి వ్యక్తి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని ఆరాధనలో పాల్గొనమని ప్రోత్సహించాలి, ఆదేశించాలి. అలాగే, వారికి సహనంతో, దయతో మార్గనిర్దేశనం చేయాలి.
  4. సత్కార్యాలు చేయడానికి దృఢ సంకల్పం, సహనం, మరియు పట్టుదల చాలా అవసరం.
  5. అన్నవవి (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: "తన నడుము బిగించేవారు" అనే పదబంధానికి పండితులు వివిధ అర్థాలను తెలిపినారు. కొంతమంది చెప్పిన ప్రకారం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింత ఎక్కువగా శ్రమించి, ఆరాధనలలో నిమగ్నమయ్యే విషయాన్ని సూచిస్తుంది. "ఈ విషయం కోసం నేను నా నడుము బిగించాను" అని చెప్పడం అంటే - దానిని పూర్తి చేయడానికి గట్టిగా కట్టుబడటం, మొత్తం సమయాన్ని కేటాయించడం అన్నమాట.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి