+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«نَضَّرَ اللَّهُ امْرَأً سَمِعَ مِنَّا شَيْئًا فَبَلَّغَهُ كَمَا سَمِعَ، فَرُبَّ مُبَلِّغٍ أَوْعَى مِنْ سَامِعٍ».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 2657]
المزيــد ...

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకగా తాను విన్నానని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు.

[దృఢమైనది] - - [سنن الترمذي - 2657]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేశారు: 'ఎవరైతే నా మాటలు విని, వాటిని గట్టిగా గుర్తుంచుకుని ఇతరులకు చేరవేస్తాడో, అల్లాహ్ అతనికి ఇహలోకంలో తేజస్సు, ఆనందం మరియు అందాన్ని ప్రసాదించుగాక! మరియు పరలోకంలో స్వర్గం యొక్క తేజస్సు, సుఖాలు మరియు ప్రకాశాన్ని అనుగ్రహించుగాక!' ఎందుకంటే, సందేశాన్ని అందుకున్న వ్యక్తి (శిష్యుడు), దాన్ని తెలియజేసిన వ్యక్తి (గురువు) కంటే ఎక్కువ గ్రహించే శక్తి, వివేకం మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. ఇదే విధంగా, మొదటి వ్యక్తి (గురువు) సరిగ్గా గుర్తుంచుకుని అందించడంలో నిష్ణాతుడైతే, రెండవ వ్యక్తి (శిష్యుడు) ఆలోచించి తార్కికంగా అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు కావచ్చు."

من فوائد الحديث

  1. ప్రవక్త సున్నతుల పరిరక్షణ చేయటం మరియు వాటిని ప్రజలకు అందజేయడం పై ప్రోత్సహించబడింది.
  2. హదీథు జ్ఞానం కలిగి ఉన్న ప్రజల ఔన్నత్యం మరియు ఆ జ్ఞానాన్ని కోరుకునే వారి ఔన్నత్యం ఇక్కడ స్పష్టం చేయబడింది.
  3. హదీథుల గురించి మంచి జ్ఞానం మరియు అవగాహన కలిగిన పండితుల ఔన్నత్యం తెలుపబడింది.
  4. సహాబాలను రదియల్లాహు అన్హుమ్ గౌరవించుట అనివార్యం, ఎందుకంటే వారు ప్రత్యక్షంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథులు విన్నవారు, వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకుని మనకు అందజేశారు. వారు ఇస్లాం సందేశాన్ని సంరక్షించిన నమ్మకమైన వారధులు.
  5. దీనిని మనావి (రహిమహుల్లాహ్) వివరిస్తూ ఇలా అన్నారు: 'ఈ హదీథు ద్వారా స్పష్టమవుతుంది హదీథు విన్న వారికి ఫిఖ్'హ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం) తెలిసి ఉండవలసిన అవసరం లేదు. అతని ప్రధాన బాధ్యత హదీథును సరిగ్గా గుర్తుంచుకోవడం. ఫిఖ్'హ్ అవగాహన చేసుకోవడం మరియు దీర్ఘాలోచన చేయడం వంటివి ఫకీహ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రవేత్త) యొక్క పని.'
  6. "ఇబ్ను ఉయైనా (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: 'హదీథు జ్ఞానం అభ్యసించే ప్రతి వ్యక్తి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు (నజ్రా) కనిపిస్తుంది - అది ఈ హదీథు కారణంగా వచ్చే ఆశీర్వాదం కావచ్చు.'"
  7. ముహద్దిస్ (హదీథు పండితుల) దృష్టిలో స్మృతి (కంఠస్థము) రెండు రకాలు: హృదయంలో & మనస్సులో గుర్తుంచుకోవడం (హిఫ్జ్-ఎ-కల్బ్ వ సద్ర్) మరియు పుస్తకాలు & రచనల ద్వారా సంరక్షించడం (హిఫ్జ్-ఎ-కితాబ్ వ సత్ర్). మరియు ఈ రెండు రకాల సంరక్షణలకు కూడా హదీథులోని దుఆ వర్తిస్తుంది."
  8. ప్రజల అవగాహన సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది. ఎన్నో సార్లు సందేశాన్ని అందజేసేవాడు దాన్ని విన్నవాడి కంటే ఎక్కువ గ్రహించే శక్తి కలిగి ఉంటాడు. అలాగే, ఎందరో జ్ఞానాన్ని మోసుకెళ్లేవారు ఉన్నప్పటికీ, వాస్తవానికి వారు నిజమైన న్యాయశాస్త్రవేత్తలు (ఫుఖహా) కాక పోవచ్చు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా