ఉప కూర్పులు

హదీసుల జాబితా

ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వాస్తవానికి మిమ్ములను నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; కానీ జీబ్రయీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చారు, దైవదూతల ముందు అల్లాహ్ మిమ్మల్ని గురించి గర్విస్తున్నాడు” అని తెలియజేశారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు
عربي ఇంగ్లీషు ఉర్దూ