عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: لَأُحَدِّثَنَّكُمْ حَدِيثًا سَمِعْتُهُ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ يُحَدِّثُكُمْ بِهِ أَحَدٌ غَيْرِي: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يُرْفَعَ العِلْمُ، وَيَكْثُرَ الجَهْلُ، وَيَكْثُرَ الزِّنَا، وَيَكْثُرَ شُرْبُ الخَمْرِ، وَيَقِلَّ الرِّجَالُ، وَيَكْثُرَ النِّسَاءُ حَتَّى يَكُونَ لِخَمْسِينَ امْرَأَةً القَيِّمُ الوَاحِدُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5231]
المزيــد ...
అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను మీకొక హదీసును చెబుతాను, దానిని నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నాను. ఈ హదీథును నేను గాక ఇంకెవరూ మీకు చెప్పరు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5231]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ స్థాపించబడుటకు సమీప కాలములో ప్రస్ఫుటమయ్యే సూచనలను తెలియ జేస్తున్నారు – అందులో ఒకటి (ఈ భూమి నుండి) షరియత్ యొక్క ఙ్ఞానము లేపుకోబడుతుంది. అది ఙ్ఞానవంతుల, పండితుల, విద్వాంసుల మరణం వలన సంభవిస్తుంది. దాని పరిణామముగా అఙ్ఞానము విపరీతముగా పెరుగుతుంది, అంతటా వ్యాపిస్తుంది. వ్యభిచారము, అశ్లీలత విపరీతంగా వ్యాపిస్తాయి. సారా త్రాగడం సర్వ సాధారణమైపోతుంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఎంతగా అంటే, యాభై మంది స్త్రీలకు వారి వ్యవహారాలు, మంచిచెడులు చూడడానికి ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు.