عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ تَقُومُ السَّاعَةُ حَتَّى يَمُرَّ الرَّجُلُ بِقَبْرِ الرَّجُلِ فَيَقُولُ: يَا لَيْتَنِي مَكَانَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7115]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 7115]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: "ఏదైనా ఒక సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి, ఆ సమాధిని చూస్తూ అతడి స్థానములో తానుంటే ఎంత బాగుండును అని అనుకునేటంత వరకూ అంతిమ ఘడియ స్థాపించబడదు". ఆ వ్యక్తి అలా ఎందుకు అనుకుంటాడూ అంటే ప్రపంచములో అసత్యము మరియు దాని జనులు బాగా ప్రబలిపోవడం, ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ, అరాచకత్వమూ బాగా ప్రబలిపోయి, తన(లో) ధర్మము ఎక్కడ బలహీనపడిపోతుందో అనే భయంతో అతడు అలా అనుకుంటాడు.