+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: خَرَجَ مُعَاوِيَةُ عَلَى حَلْقَةٍ فِي الْمَسْجِدِ، فَقَالَ: مَا أَجْلَسَكُمْ؟ قَالُوا: جَلَسْنَا نَذْكُرُ اللهَ، قَالَ آللَّهِ مَا أَجْلَسَكُمْ إِلَّا ذَاكَ؟ قَالُوا: وَاللهِ مَا أَجْلَسَنَا إِلَّا ذَاكَ، قَالَ: أَمَا إِنِّي لَمْ أَسْتَحْلِفْكُمْ تُهْمَةً لَكُمْ، وَمَا كَانَ أَحَدٌ بِمَنْزِلَتِي مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَقَلَّ عَنْهُ حَدِيثًا مِنِّي:
وَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ عَلَى حَلْقَةٍ مِنْ أَصْحَابِهِ، فَقَالَ: «مَا أَجْلَسَكُمْ؟» قَالُوا: جَلَسْنَا نَذْكُرُ اللهَ وَنَحْمَدُهُ عَلَى مَا هَدَانَا لِلْإِسْلَامِ، وَمَنَّ بِهِ عَلَيْنَا، قَالَ: «آللَّهِ مَا أَجْلَسَكُمْ إِلَّا ذَاكَ؟» قَالُوا: وَاللهِ مَا أَجْلَسَنَا إِلَّا ذَاكَ، قَالَ: «أَمَا إِنِّي لَمْ أَسْتَحْلِفْكُمْ تُهْمَةً لَكُمْ، وَلَكِنَّهُ أَتَانِي جِبْرِيلُ فَأَخْبَرَنِي أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يُبَاهِي بِكُمُ الْمَلَائِكَةَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2701]
المزيــد ...

అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(ఒకసారి) ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు మస్జిదులో వృత్తాకారంలో కూర్చుని ఉన్న కొంతమంది యువకుల వద్దకు వెళ్ళి “ఏ విషయం మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చునేలా చేసింది?” అని ప్రశ్నించారు. దానికి వారు “అల్లాహ్’ను స్మరించడానికి (జిక్ర్ చేయడానికి) కూర్చున్నాము” అన్నారు. దానికి ఆయన “అల్లాహ్ సాక్షిగా చెప్పండి దాని కొరకు తప్ప (మరింక దేని కొరకూ) కూర్చోలేదా మీరు?” అన్నారు. అందుకు వారు “అల్లాహ్ సాక్షిగా దాని కొరకు తప్ప (మరింక దేని కొరకూ) కూర్చో లేదు మేము” అన్నారు. అపుడు ఆయన వారితో “మిమ్మల్ని నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం కు సంబంధించి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు నా అంత సన్నిహితంగా ఉన్న ఏ ఒక్కరూ కూడా నా కంటే తక్కువ హదీథులు చెప్పలేదు.”
“వాస్తవానికి (ఒకసారి) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది, వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి “ఏ విషయం మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చునేలా చేసింది?” అని ప్రశ్నించారు. దానికి వారు ఇలా అన్నారు “మమ్మల్ని ఇస్లాం వైపు నడిపించినందుకు, మాపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరించడానికి, ఆయనను స్తుతించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా చెప్పండి దాని కొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చోలేదా మీరు?” అన్నారు. అందుకు వారు “అల్లాహ్ సాక్షిగా దానికొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చో లేదు మేము” అన్నారు. అపుడు ఆయన వారితో “వాస్తవానికి మిమ్ములను నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; కానీ జీబ్రయీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చారు, దైవదూతల ముందు అల్లాహ్ మిమ్మల్ని గురించి గర్విస్తున్నాడు” అని తెలియజేశారు.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2701]

వివరణ

ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హుమా ఒకసారి, కొద్దిమంది సహాబాలు వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి దేని కొరకు అలా సమావేశమయ్యారని ప్రశ్నించారు. వారు “అల్లాహ్ యొక్క స్మరణ కొరకు కూర్చున్నాము” అని బదులిచ్చారు. అపుడు ఆయన రజియల్లాహు అన్హు అక్కడ అలా గుమిగూడి కూర్చోవడం కేవలం అల్లాహ్ యొక్క స్మరణ కొరకు మాత్రమే తప్ప మరింకేమీ కాదు అని వారితో ప్రమాణం చేయించినారు. వారు ఆ విధంగా ప్రమాణం చేసినారు. అప్పుడు ఆయన వారితో : “నేను మీతో ప్రమాణం చేయించింది మిమ్ములను అనుమనించో, లేక మీ సత్యసంధతను శంకించో కాదు” అని పలికి, వారికి ఇలా తెలియజేసినారు – సహాబాలలో తనంత సన్నిహితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇంకెవ్వరూ లేరనీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఉమ్మె హబీబహ్ రజియల్లాహు అన్హా తన సహోదరి అనీ, అంతేగాక ‘కాతిబ్ అల్ వహీ’ లలో (ఖుర్’ఆన్ అవరణ జరుగుతుండగా గ్రంథస్థం చేసిన వ్రాయసకారులలో) తాను ఒకడినని – అయినప్పటికీ తాను చాలా కొద్ది హదీథులను మాత్రమే ఉల్లేఖించినానని తెలియజేసినారు. తరువాత ఆయన వారితో “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటినుండి బయటకు వచ్చినారు. వారి చూపు అక్కడ మస్జిదులో వృత్తాకారములో కూర్చుని ఉన్న కొంతమంది సహాబాలపై పడింది. వారు, తమను ఇస్లాం వైపు నడిపించినందుకు, తమపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరిస్తున్నారు, ఆయనను కొనియాడుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలను, ముఆవియహ్ రజియల్లాహు అన్హు తన అనుచరులను ప్రశ్నించిన మాదిరిగా ప్రశ్నించినారు, ఆయన వారితో ప్రమాణం చేయించిన మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రమాణం చేయించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలకు తాను ఆ విధంగా వారిని ప్రశ్నించడం మరియు వారితో ప్రమాణం చేయించడం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేసినారు – దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినారని, సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అలాహ్ మిమ్ములను గురించి తన దైవదూతల ముందు గర్వపడుతున్నడని, మీ ఘనతలను, మీ సత్కార్యాలను వారికి చూపుతున్నాడని, వారి ఎదుట మిమ్ములను పొగుడుతున్నాడని జిబ్రయీల్ అలైహిస్సలాం తనకు సమాచారమిచ్చినారని వారికి తెలియజేసినారు.

من فوائد الحديث

  1. ఈ హదీసులో ముఆవియహ్ రజియల్లాహు అన్హు ఘనత గురించి తెలుస్తున్నది, ధార్మిక ఙ్ఞానాన్ని ఇతరులకు చేరవేయడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని ఆయన నిశితంగా అనుసరించడం పట్ల ఆయన ఆసక్తిని గమనించవచ్చు.
  2. విషయము యొక్క గాంభీర్యత మరియు ప్రాముఖ్యత కారణంగా ఎదుటి వారి సంకల్పాన్ని శంకించకుండా, వారి పూర్తి ధ్యానము విషయము పట్ల కేంద్రీకరించుటకు వారితో ప్రమాణం చేయించవచ్చును అనడానికి ఇందులో మనకు ఆధారం లభిస్తున్నది.
  3. అలాగే ఇందులో అల్లాహ్ యొక్క స్మరణ జరిగే సమావేశాల, మరియు ఙ్ఞానసంబంధమైన సమావేశాల ఘనతను చూడవచ్చు, అటువంటి వారిని గురించి అల్లాహ్ గర్వపడుటను, వారిని తన దైవదూతల ఎదుట పొగుటను మనం గమనించవచ్చు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా