عن أبي موسى الأشعري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ حَمَلَ عَلَيْنَا السِّلَاحَ فَلَيْسَ مِنَّا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7071]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 7071]
ముస్లిములను భయపెట్టడానికి లేదా వారిని దోచుకోవడానికి, వారికి నష్టం కలిగించడానికి ఎవరైతే ఆయుధాలను ఎత్తుతారో వారికి వ్యతిరేకంగా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిస్తున్నారు. అన్యాయంగా, అధర్మంగా ఎవరైతే అటువంటి పనికి పాల్బడుతారో అటువంటి వాడు ఘోరాతి ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. అటువంటి వాడు ఈ కఠినమైన హెచ్చరికకు పాత్రుడవుతాడు.