عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
قَدِمَ أُنَاسٌ مِنْ عُكْلٍ أَوْ عُرَيْنَةَ، فَاجْتَوَوْا المَدِينَةَ فَأَمَرَهُمُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِلِقَاحٍ، وَأَنْ يَشْرَبُوا مِنْ أَبْوَالِهَا وَأَلْبَانِهَا، فَانْطَلَقُوا، فَلَمَّا صَحُّوا قَتَلُوا رَاعِيَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَاسْتَاقُوا النَّعَمَ، فَجَاءَ الخَبَرُ فِي أَوَّلِ النَّهَارِ، فَبَعَثَ فِي آثَارِهِمْ، فَلَمَّا ارْتَفَعَ النَّهَارُ جِيءَ بِهِمْ، فَأَمَرَ فَقَطَعَ أَيْدِيَهُمْ وَأَرْجُلَهُمْ، وَسُمِرَتْ أَعْيُنُهُمْ، وَأُلْقُوا فِي الحَرَّةِ، يَسْتَسْقُونَ فَلاَ يُسْقَوْنَ، قَالَ أَبُو قِلاَبَةَ: فَهَؤُلاَءِ سَرَقُوا وَقَتَلُوا، وَكَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ، وَحَارَبُوا اللَّهَ وَرَسُولَهُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 233]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి (అక్కడ ఉన్నన్ని దినాలు) పాలు ఇచ్చే ఒంటెలను ఇవ్వమని మరియు (వారి అనారోగ్యానికి మందుగా) వాటి మూత్రం మరియు పాలు త్రాగమని ఆదేశించినారు. వారు అక్కడి నుండి (ఒంటెలను ఉంచిన ప్రదేశానికి) వెళ్లిపోయారు. అక్కడ వారు కోలుకున్న తర్వాత, వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఒంటెల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళారు. ఆ వార్త తెల్లవారుజామున తెలిసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి పట్టుకు రావడానికి ప్రజలను పంపారు. సూర్యుడు ఉదయించినప్పుడు, వారిని తిరిగి తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చేతులు మరియు కాళ్ళు నరికివేయాలని, మరియు వారి కళ్ళపై వాతలు పెట్టాలని ఆదేశించారు. తరువాత వారు అల్-హర్రా అనే ప్రదేశములో విసిరివేయబడినారు. అక్కడ వారు నీటి కోసం అడుక్కున్నారు కానీ వారికి నీరు ఇవ్వబడలేదు. అబూ కిలాబా ఇలా అన్నారు: “వారు దొంగతనం చేశారు, చంపారు, విశ్వాసం స్వీకరించిన తర్వాత అవిశ్వాసులుగా మారినారు మరియు అల్లాహ్ మరియు ఆయన దూతపై యుద్ధం చేశారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 233]
ఉక్ల్ మరియు ఉరైనా తెగల నుండి కొంత మంది పురుషులు ముస్లింలుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చారు, కానీ వారి కడుపు ఉబ్బేలా చేసే వ్యాధి వారిని పట్టుకుంది. మదీనాలో ఆహారం మరియు గాలి వారికి సరిపోకపోవడంతో వారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని జకాత్ కొరకు ఒంటెలను ఉంచిన చోటికి వెళ్లి వాటి మూత్రం మరియు పాలు తాగమని ఆదేశించారు. వారు బయలుదేరారు. అక్కడికి చేరుకుని వారు కోలుకున్నారు, లావుగా, ఆరోగ్యవంతంగా తయారై, తిరిగి తమ శరీరపు ఛాయను సంతరించుకున్నారు. అప్పుడు వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పశువుల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళినారు. ఆ సంఘటన గురించిన వార్త తెల్లవారుజామున తెలిసింది. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి, పట్టుకుని రావడానికి ప్రజలను పంపినారు. వారు పట్టుబడ్డారు. తెల్లవారుజామున, వారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు బందీలుగా తీసుకువచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి చేతులు మరియు పాదాలను నరకమని ఆదేశించారు; పశువుల కాపరికి అలా చేసినందున వారి కళ్ళను పెరికి వేయమని, అగ్నిపర్వతపు ప్రాంతముగా పేరుగాంచిన అల్-హర్రా అనే ప్రాంతములో వారిని పడవేయమని ఆదేశించినారు. అక్కడ వారు నీటి కొరకు వేడుకున్నారు. కానీ వారు చనిపోయే వరకు వారికి నీరు అందలేదు. అబూ ఖిలాబహ్ ఇలా అన్నారు: వారు దొంగతనానికి పాల్బడినారు; హత్యకు పాల్బడినారు, విశ్వాసము స్వీకరించి తిరిగి అవిశ్వాసులుగా మారినారు; మరియు అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి వ్యతిరేకంగా యుధ్ధం చేసినారు.