+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ تَرَدَّى مِنْ جَبَلٍ فَقَتَلَ نَفْسَهُ فَهُوَ فِي نَارِ جَهَنَّمَ يَتَرَدَّى فِيهِ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ تَحَسَّى سُمًّا فَقَتَلَ نَفْسَهُ فَسُمُّهُ فِي يَدِهِ يَتَحَسَّاهُ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ قَتَلَ نَفْسَهُ بِحَدِيدَةٍ فَحَدِيدَتُهُ فِي يَدِهِ يَجَأُ بِهَا فِي بَطْنِهِ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5778]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు నిరంతరం అలా దూకుతూనే ఉంటాడు; ఎవరైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా ఆ విషం అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే విషాన్ని అతడు నిరంతరం తాగుతూనే ఉంటాడు; ఎవరైనా కత్తితో లేదా ఇనుప వస్తువుతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అది అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే వస్తువుతో అతడు నిరంతరం తన పొట్టను గాయపరుస్తూనే ఉంటాడు."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5778]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మహత్య గురించి స్పష్టంగా హెచ్చరించారు: ఎవరేనా ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుంటే, ప్రపంచంలో చేసిన విధంగానే పరలోకంలో కూడా చేస్తూ నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఎవరైనాా ఈలోకంలో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు శాశ్వతంగా కొండలపై నుంచి లోయలలోనికి దూకుతూ నిరంతరం శిక్ష అనుభవిస్తాడు. ఎవరైనా విషం ఆత్మహత్య చేసుకుంటే: నరకంలో కూడా అతని చేతిలో విషం ఉంటుంది, మరియు నరకంలో కూడా అదే విషాన్ని మళ్లీ మళ్లీ తాగుతూ శాశ్వతంగా శిక్ష అనుభవిస్తాడు. ఎవరైనా ఇనుప వస్తువుతో పొట్టను గాయపరుచుకుని చనిపోతే: నరకంలో అతని చేతిలో అదే ఇనుప వస్తువు ఉంటుంది, నరకంలో కూడా అదే వస్తువుతో పొట్టను గాయపరుచుకుంటూ శాశ్వతంగా శిక్ష అనుభవిస్తాడు.

من فوائد الحديث

  1. ఇస్లాం ధర్మంలో మనిషి తనను తాను చంపుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఇది అతి పెద్ద పాపాల్లో ఒకటి, దీనికి తీవ్రమైన శిక్ష ఉంది.
  2. హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడు కొన్ని విధాలలో ఆత్మహత్య చేసుకునే ఉదాహరణలు మాత్రమే తెలిపినారు. కానీ, మనిషి తనను తాను ఏ విధంగా చంపుకున్నా అంటే ఆత్మహత్య చేసుకున్నా, అదే విధంగా నరకంలో శిక్ష అనుభవిస్తాడు. సహీహ్ బుఖారీ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "తనను తాను ఉరి వేసుకుని చంపుకున్నవాడు, నరకంలో కూడా అలాగే ఉరి వేసుకుంటూ శిక్ష అనుభవిస్తాడు." అలాగే "తనను తాను కత్తితో గాయపరిచి చంపుకున్నవాడు, నరకంలో కూడా అలాగే కత్తితో గాయపరుచు కుంటూ శిక్ష అనుభవిస్తాడు."
  3. ఇమామ్ నవవి వ్యాఖ్యానం — "నరకంలో శాశ్వతంగా ఉంటాడు" అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి, వాటిలో: మొదటి అభిప్రాయం: "నరకంలో శాశ్వతంగా ఉంటాడు" అంటే ఎవరు ఆత్మహత్యను హరామ్ (నిషేధం) అని తెలుసుకున్నప్పటికీ, దాన్ని హలాల్ (అనుమతించబడింది) అని నమ్మి, ఉద్దేశపూర్వకంగా చేస్తే, అతను కాఫిర్ (ధర్మ విరుద్ధుడు) అవుతాడు. అలాంటి వారికి శాశ్వత నరక శిక్ష ఉంటుంది. రెండవ అభిప్రాయం: ఇక్కడ "శాశ్వతం" అంటే నిజంగా ఎప్పటికీ అని కాదు. అది చాలా ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం అనే అర్థంలో ఉంది. ఉదాహరణకు, "అల్లాహ్ ఆ రాజు పాలనను శాశ్వతంగా ఉండనివ్వాలి" అని చెబుతారు — అంటే చాలా కాలం, అనేగానీ ఎప్పటికీ అని కాదు. మూడవ అభిప్రాయం: ఇది ఆత్మహత్య చేసుకున్నవారికి శిక్షగా చెప్పబడింది. కానీ, ఎవరు ఇస్లామీయ ధర్మవిశ్వాసంతో చనిపోతారో, అల్లాహ్ వారిని తన కరుణతో, శాశ్వతంగా నరకంలో ఉంచడు.
  4. ఇది పరలోక శిక్షలు ఈ లోకంలో చేసిన పాపాలకు అనుగుణంగా ఉండే విధానానికి ఉదాహరణ. మనిషి తనకు తాను నష్టపరుచుకున్నా, లేదా ఇంకొకరిని నష్టపరిచినా, రెండింటికీ పాపంలో తేడా లేదు; ఎందుకంటే మన ప్రాణం మనదే అనడం సరికాదు, అది అల్లాహ్‌కు చెందినది. కాబట్టి, మనం మన ప్రాణంతో కూడా అల్లాహ్ అనుమతించిన విధంగా మాత్రమే వ్యవహరించాలి; మన ఇష్టం మేరకు మన ప్రాణం తీసుకోవడానికి అంటే ఆత్మహత్య చేసుకునేందుకు ఎలాంటి హక్కూ మనకు లేదు.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా