عَنْ ابنِ عُمَرَ رَضيَ اللهُ عنهما عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنِ اقْتَنَى كَلْبًا إِلَّا كَلْبَ ضَارٍ أَوْ مَاشِيَةٍ نَقَصَ مِنْ عَمَلِهِ كُلَّ يَوْمٍ قِيرَاطَانِ»، قَالَ سَالِمٌ: وَكَانَ أَبُو هُرَيْرَةَ يَقُولُ: «أَوْ كَلْبَ حَرْثٍ»، وَكَانَ صَاحِبَ حَرْثٍ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1574]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి." దానికి సాలిమ్ ఇలా చెప్పినారు: అబూ హురైరా రదియల్లాహు అన్హు వద్ద ఒక పొలం ఉండేది, అతను ఇలా చెప్పేవారు: "లేదా పొలం కాపాడే కుక్క అయితే కూడా (వ్యతిరేకం లేదు)."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1574]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: "వేట కోసం, పశువులను లేదా పంటలను కాపాడే అవసరం కోసం తప్ప, ఇతర కారణాల కోసం కుక్కను పెంచడం నిషిద్ధం. ఇతర ఉద్దేశాల కోసం కుక్కను పెంచినవారి సత్కార్యాల నుంచి ప్రతిరోజూ రెండు ఖీరాతులు (దాని పరిమాణం కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు) తగ్గిపోతాయి.