عن معاوية بن أبي سفيان رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «من يُرِدِ الله به خيرا يُفَقِّهْهُ في الدين».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

ముఆవియా బిన్ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

అల్లాహ్ ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని మరియు మంచి చేయాలని కోరుకుంటాడో,అతనికి షరియా జ్ఞానాన్ని మరియు బుద్ది వివేకాన్ని అనుగ్రహిస్తాడు,ఫిఖా జ్ఞానం రెండు రకాలుగా విభజించబడుతుంది:ఒకటి వివరణాత్మక ప్రమాణాలతో గల ఆచరణాత్మక షరియా ఆదేశాల పరిజ్ఞానం,ఉదా : ఆరాధనలకు మరియు వ్యవహారాలకు సంభందించిన ఆదేశాలు ,రెండు : మహోన్నతుడైన అల్లాహ్ ధర్మం గురించి మాత్రమే తెలియజేసే జ్ఞానం,ఇందులో ఈమాన్ మూలపునాదులు,ఇస్లాం చట్టాలు,హలాలు మరియు హరాము వ్యవహారాలు మరియు ప్రవర్తనలు మరియు మర్యాదలతో ఇమిడి ఉన్నాయి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో ధార్మిక జ్ఞానం కలిగియుండటం మరియు దానిపై మక్కువ కలిగియుండటం మహత్తర విషయాలు అని ఈ హాదీసు సాక్ష్యపరుస్తుంది
  2. ఫిఖా జ్ఞానం రెండు రకాలుగా విభజించబడుతుంది:ఒకటి వివరణాత్మక ప్రమాణాలతో గలఆచరణాత్మక షరియాపరమైన ఆదేశాల పరిజ్ఞానం,ఉదా : ఆరాధనలకు మరియు వ్యవహారాలకు సంభందించిన ఆదేశాలు ,రెండు : మహోన్నతుడైన అల్లాహ్ ధర్మం గురించి మాత్రమే తెలియజేసే జ్ఞానం,ఇందులో ఈమాన్ మూలపునాదులు,ఇస్లాం చట్టాలు,హలాలు మరియు హరాము వ్యవహారాలు మరియు ప్రవర్తనలు మరియు మర్యాదలకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి
  3. ఈ హదీసు వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి 'ఎవరైతే ఇస్లాంవిధ్య పట్ల నిర్లక్ష్య ధోరణి అవలబిస్తారో మహోన్నతుడైన అల్లాహ్ అతనిపట్ల మేలును కోరడు
  4. ఎవరైతే ధర్మ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగియుంటాడో నిశ్చయంగా అల్లాహ్ అతన్నిప్రేమిస్తాడు, ఎందుకంటే అల్లాహ్ అతనికి ధార్మిక విధ్య మరియు ధర్మ జ్ఞానం అనుగ్రహిస్తూ అతని కొరకు మేలును కోరుతాడు.
  5. నిస్సందేహంగా ఇస్లాం ధర్మ జ్ఞానం ప్రశంసనీయమైనది,ఇక ఇతర ధర్మ జ్ఞానా లు కలియుండటం ప్రశంసనీయమైనది కాదు మరియు నిందించదగ్గ విషయం కూడాకాదు,కానీ ఒకవేళ అది ప్రశంసనీయ కార్యానికి మధ్యమంగా ఉపయోగపడితే ప్రశంసించబడుతుంది,అదే చెడు కార్యానికి మాధ్యమం అయితే నిందించబడుతుంది.
ఇంకా