عن أبي أيوب رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «مَنْ قَالَ: لَا إلَهَ إلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ عَشْرَ مَرَّاتٍ كَانَ كَمَنْ أَعْتَقَ أَرْبَعَةَ أَنْفُسٍ مِنْ وَلَدِ إسْمَاعِيلَ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూఅయ్యూబ్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ ‘లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుళ్లి షైయిన్ ఖదీర్’ పది సార్లు చదువుతారో అతను ఇస్మాయీల్ సంతతి కి చెందిన నలుగురు బానిసలను విముక్తి పరచిన దానికి సమానం’
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసు పై హదీసులో ప్రస్తావించబడ్డ అల్లాహ్ స్మరణ యొక్క ఘనతను తెలియజేస్తుంది,ఎందుకంటే ఇందులో అల్లాహ్ ఏకత్వం’అంగీకారము ఉన్నది,ఎవరైతే పది సార్లు ఈ స్మరణను అర్థం చేసుకుని దాని షరతుల ప్రకారం కార్యసాధన చేస్తాడో అతనికి ఇబ్రహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్మాయిల్ సంతతి నుండి నలుగురు బానిసలను విముక్తి చేసిన వారికి లభించే సమానమైన బహుమతి లభిస్తుంది (అలైహిముస్ససలాతు వస్సాలాం)

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇస్లాం పునాది కలిమా తౌహీద్ 'తో నిండిన ఈ స్మరణ ఎంతో ప్రాముఖ్యత గలది
  2. దైవత్వం లో,రాజ్యాధికారంలో మరియు స్తుతిలో మహోన్నతుడు,పవిత్రుడైన ఏకైకుడైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది.
  3. హదీసు ప్రయోజనాల్లో ఒకటి:నిశ్చయంగా అల్లాహ్ కు మాత్రమే సమస్త సామ్రాజ్యాధికారం,సమస్త స్తుతులు చెందుతాయి,మరియు ప్రతీ వస్తువు పై ఆయన శక్తిసామార్ద్యాలు ఆవిరించి ఉన్నాయి,
  4. ఈ స్మరణలో‘యుహ్యీ’వ యుమీతు’ జోడించలేదు
  5. హదీసులో ‘అష్ర మర్రాతిన్’ "పదిసార్లు" అని దైవప్రవక్త చెప్పిన మాట స్పష్టంగా ఉంది, వరుసగా లేదా విడిగా స్మరించడంలో తేడా లేదని తెలియజేస్తుంది.
  6. కొంతమంది అరబ్బులు బానిసలవుతారు ఆ కారణాలు వారిపై ఏర్పడినప్పుడు,హదీసులో ఈ విషయం పట్ల అనుమతి చూపబడినది.
  7. ఇతరులపై అరబ్బులకు ప్రధాన ఘనత ఉంది,ఎందుకంటే వారు ఇస్మాయీల్ సంతతి వారు.
ఇంకా