عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ قَالَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ، حُطَّتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6405]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు:
“ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”.
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 6405]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకూ, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు క్షమించి వేయబడతాయి, మరియు తుడిచి వేయబడతాయి, అవి సముద్రపు అలలు తీరాన్ని బలంగా తాకినపుడు ఏర్పడే నురగ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ.