عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَعَلَّمُوا الْعِلْمَ لِتُبَاهُوا بِهِ الْعُلَمَاءَ، وَلَا لِتُمَارُوا بِهِ السُّفَهَاءَ، وَلَا تَخَيَّرُوا بِهِ الْمَجَالِسَ، فَمَنْ فَعَلَ ذَلِكَ، فَالنَّارُ النَّارُ».
[صحيح] - [رواه ابن ماجه] - [سنن ابن ماجه: 254]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి. అలాగే సమావేశాలలో ఉన్నత ఆసనం (కావాలని) ఎంచుకోకండి. ఎవరైతే అలా చేస్తారో – (వారి కొరకు) నరకాగ్ని, నరకాగ్ని”.
[దృఢమైనది] - [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు] - [سنن ابن ماجه - 254]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఉలమాలు, పండితులు, విద్వాంసుల ముందు డాంబికాలు పలుకడానికో, లేదా ‘నేను కూడా మీలాగే పండితుడిని’ చెప్పుకోవడానికో, లేక బుద్ధి హీనులు, అఙ్ఞానులతో వాదనలో వారిలో పైచేయి అనిపించుకోవడానికో, లేక సభలు, సమావేశాలలో ప్రాముఖ్యత సాధించుకోవడానికో ఙ్ఞాన సముపార్జన చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తారో అలాంటి వారు తమ ప్రదర్శనా బుద్ధి కారణంగా, మరియు ఙ్ఞాన సముపార్జన కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి అనే సంకల్పశుద్ధి లేకపోయినందువల్ల అతడు నరకాగ్నికి పాత్రుడు అవుతాడు.