عَنْ النَّوَّاسِ بْنِ سَمْعَانَ الْأَنْصَارِيِّ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«ضَرَبَ اللهُ مَثَلًا صِرَاطًا مُسْتَقِيمًا، وَعَلَى جَنْبَتَيْ الصِّرَاطِ سُورَانِ، فِيهِمَا أَبْوَابٌ مُفَتَّحَةٌ، وَعَلَى الْأَبْوَابِ سُتُورٌ مُرْخَاةٌ، وَعَلَى بَابِ الصِّرَاطِ دَاعٍ يَقُولُ: أَيُّهَا النَّاسُ، ادْخُلُوا الصِّرَاطَ جَمِيعًا، وَلَا تَتَعَرَّجُوا، وَدَاعٍ يَدْعُو مِنْ فَوْقِ الصِّرَاطِ، فَإِذَا أَرَادَ يَفْتَحُ شَيْئًا مِنْ تِلْكَ الْأَبْوَابِ، قَالَ: وَيْحَكَ لَا تَفْتَحْهُ، فَإِنَّكَ إِنْ تَفْتَحْهُ تَلِجْهُ، وَالصِّرَاطُ الْإِسْلَامُ، وَالسُّورَانِ: حُدُودُ اللهِ، وَالْأَبْوَابُ الْمُفَتَّحَةُ: مَحَارِمُ اللهِ، وَذَلِكَ الدَّاعِي عَلَى رَأْسِ الصِّرَاطِ: كِتَابُ اللهِ، وَالدَّاعِي مِنِ فَوْقَ الصِّرَاطِ: وَاعِظُ اللهِ فِي قَلْبِ كُلِّ مُسْلِمٍ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [مسند أحمد: 17634]
المزيــد ...
నవాస్ ఇబ్న్ సమ్ఆన్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.
[దృఢమైనది] - - [مسند أحمد - 17634]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ ఇస్లాంను వంకరటింకరలు లేని ఒక విశాలమైన మరియు సూటియైన రహదారి (రాచమార్గము) తో పోల్చినారు. ఆ మార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలున్నాయి, లేక ఆ మార్గము రెండు ఎత్తైన గోడలతో పరివేష్టించబడి ఉన్నది. అవి రెండూ అల్లాహ్ విధించిన హద్దులు. ఆ రెండు గోడలలో అనేక తెరువబడి ఉన్న తలుపులు ఉన్నాయి. అవి అల్లాహ్ నిషేధాలు. ఆ తలుపులపై తెరలు వేయబడి ఉన్నాయి. ఆ తెరలు రహదారిపై వెళుతున్న వ్యక్తికి లోన ఎవరున్నారో (లేక ఏమి ఉన్నదో) కనిపించ నీయవు. ఆ రహదారి ప్రవేశం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఉంటాడు, అతడు ప్రజలను పిలుస్తూ, వారికి సూచనలిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ వారితో ఇలా అంటాడు ‘దారికి ఇరువైపులా ఎటు వైపునకూ వంగకుండా తిన్నగా నడుస్తూ ఉండండి’. ఆ దాయీ (పిలిచే వాడు) అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము. ఆ రహదారికి చివరన మరొక దాయీ ఉంటాడు. ఆ దాయీ, ఆ మార్గమున పోతూ ఉండే బాటసారి దానికి ఇరువైపులా ఉండే తలుపుల పై తెరలలో దేనినైనా ఏ కొద్దిగా తెరెవడానికి ప్రయత్నించినా అతనితో ఇలా అంటాడు: “నీ పాడు గాను! దానిని తెరువకు. తెరిచావో నీవు దానిలోనికి ప్రవేశిస్తావు, ప్రవేశించకుండా నిన్ను నీవు ఆపుకోలేవు”. ఈ దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు మరియు హెచ్చరిక.