عَنْ زِيَادِ بْنِ لَبِيدٍ رضي الله عنه قَالَ:
ذَكَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَيْئًا، فَقَالَ: «ذَاكَ عِنْدَ أَوَانِ ذَهَابِ الْعِلْمِ» قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، وَكَيْفَ يَذْهَبُ الْعِلْمُ، وَنَحْنُ نَقْرَأُ الْقُرْآنَ وَنُقْرِئُهُ أَبْنَاءَنَا وَيُقْرِئُهُ أَبْنَاؤُنَا أَبْنَاءَهُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ؟ قَالَ: «ثَكِلَتْكَ أُمُّكَ زِيَادُ، إِنْ كُنْتُ لَأُرَاكَ مِنْ أَفْقَهِ رَجُلٍ بِالْمَدِينَةِ، أَوَلَيْسَ هَذِهِ الْيَهُودُ وَالنَّصَارَى يَقْرَؤونَ التَّوْرَاةَ وَالْإِنْجِيلَ، لَا يَعْمَلُونَ بِشَيْءٍ مِمَّا فِيهِمَا؟!».

[صحيح لغيره] - [رواه ابن ماجه]
المزيــد ...

జియాద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన "c2">“అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది” అన్నారు. నేను "c2">“ఓ రసూలుల్లాహ్ (ల్లల్లాహు అలైహి వసల్లం ! ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది. మేము ఖుర్’అన్ చదువు తున్నాము, మా పిల్లలకు బోధిస్తున్నాము, వారు వారి సంతానికి నేర్పుతారు. అలా తీర్పు దినము వరకు జరుగుతుంది. మరి ఙ్ఞానము ఎలా అంతరించిపోతుంది?”
అన్నాను. దానికి వారు ఇలా అన్నారు "c2">“నీ తల్లి నిన్ను కోల్పొవు గాక, ఓ జియాద్! ఈ మదీనా నగరంలో నువ్వొక మంచి ఙ్ణానవంతుడవని, మంచి పరిఙ్ఞానం కలిగిన వాడివి అని అనుకున్నాను. యూదులూ మరియు క్రైస్తవుల విషయంలో ఇలా జరగ లేదా, వారు తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలను చదువుతారు ఐనా వాటిలోని ఒక్క విషయం పై కూడా ఆచరించరు”.
పరా దృఢమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహబాల మధ్య కూర్చుని ఇలా అన్నారు: ఇది ప్రజల మధ్య నుండి ఙ్ఞానము అంతరించిపోయే సమయం. జియాద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఆశ్చర్యపోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని ఇలా ప్రశ్నించాడు: "c2">“మానుండి ఙ్ఞానము ఎలా లేపుకోబడుతుంది? మేము ఖుర్’ఆన్ ను చదివాము, కంఠస్థము చేసినాము, ప్రతి దినము పారాయణము చేస్తాము, మా భార్యలకు బోధించినాము, మా పిల్లకు బోధించినాము, వారు వారి పిల్లలకు బోధిస్తారు (మరి ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ “నీ తల్లి నిన్ను కోల్పోవుగాక ఓ జియాద్! నేను నిన్ను మదీనా నగరంలో మంచి ఙ్ఞానవంతులలో ఒకడివని భావిస్తున్నాను” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి వివరించారు: "c2">“ఙ్ఞానం అంతరించి పోవడమంటే, ఖుర్’ఆన్ అంతరించి పోతుందని అర్థం కాదు. ఆచరణ అనేది లేకపోవడం వల్ల ఙ్ఞానం అంతరించి పోతుంది.” యూదులూ మరియు క్రైస్తవుల వద్ద ఉన్న తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాల విషయం కూడా ఇదే. వారికి ప్రయోజనం కలిగించేది ఏదైనా ఉంటే అది వారు వాటి ద్వారా ఆర్జించిన ఙ్ఞానము ఆధారంగా ఆచరించడమే. (కానీ వారు జ్ఞానము ఆధారంగా ఆచరించరు).

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రజల చేతులలోఖుర్’ఆన్ మరియు ఇతర గ్రంథాలుండడం, వాటి ద్వారా ఆర్జించిన ఙ్ఞానముపై ఆచరించక పోతే, అవి నిరర్ధకమే అవుతుంది.
  2. ప్రజల మధ్య నుండి ఙ్ఞానము లేపుకోబడుట అనే దానిలోనికి : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణము, ఉలమాలు, పండితుల మరణము, మరియు ఆర్జించిన ఙ్ఞానము ఆధారంగా ఆచరించడాన్ని వదిలి వేయడం – ఇవన్నీ వస్తాయి.
  3. ప్రళయ దినపు సంకేతాలలో, ఙ్ఞానము అంతరించి పోవడం, మరియు (ప్రజలు) ఙ్ఞానము ఆధారంగా ఆచరించడాన్ని వదిలి వేయడం ఉన్నాయి.
  4. ఈ హదీసులో ఙ్ఞానము ఆధారంగా ఆచరణలు ఉండాలని, నిజానికి అదే నిర్దేశిత లక్ష్యము కావాలి అనే హితబోధ ఉన్నది.
ఇంకా