+ -

عَنْ ‌أَبِي هُرَيْرَةَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«سَيَكُونُ فِي آخِرِ أُمَّتِي أُنَاسٌ يُحَدِّثُونَكُمْ مَا لَمْ تَسْمَعُوا أَنْتُمْ وَلَا آبَاؤُكُمْ، فَإِيَّاكُمْ وَإِيَّاهُمْ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 6]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు:
“నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి."

దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తన ఉమ్మత్ యొక్క చివరి కాలములో (తన ఉమ్మత్’లోనే) కొందరు పుట్టుకొస్తారు. వారు అసత్యాలను సృష్ఠిస్తారు, మరియు అంతకు ముందు ఎవరూ చెప్పని విషయాలు చెబుతారు. వారు తప్పుడు హదీథులను, లేక కల్పించిన హదీథులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులుగా చెబుతారు. కనుక ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటువంటి వారినుండి దూరంగా ఉండమని, వారితో కూర్చో రాదని, వారి హదీథులను (సంభాషణలను, ఉపన్యాసాలను) వినరాదని ఆదేశిస్తున్నారు. లేకపోతే ఆ కల్పిత హదీసులు బయటకు తీయలేనంతగా ప్రజల మనసులలో నాటుకుని పోతాయి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ టర్కిష్ సింహళ హిందీ వియత్నమీస్ హౌసా మలయాళం స్వాహిలీ బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية القيرقيزية النيبالية اليوروبا الليتوانية الدرية الصومالية الكينياروندا التشيكية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో ఒక ప్రవక్తగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వపు నిదర్శనాలు ఉన్నాయి. వారు తన ఉమ్మత్’లో రాబోయే కాలములో ఏమి జరుగనున్నదో తెలియజేసినారు. ప్రస్తుతం వారు చెప్పినట్లుగానే జరుగుతున్నది.
  2. అలాగే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, మరియు ఇస్లాం ధర్మమును గురించి అసత్యాలు పలికే వారి నుంచి దూరంగా ఉండాలనే, మరియు వారి అసత్యాలు వినరాదనే హితబోధ ఉన్నది.
  3. ప్రామాణికత నిర్ధారణ కానంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను అనుమతించడం లేదా ప్రచారం చేయడం లేదా ప్రచురించడం చేయరాదు అనే హెచ్చరిక ఉన్నది.
ఇంకా