+ -

عَنْ ‌الزُّبَيْرِ بْنِ الْعَوَّامِ قَالَ:
لَمَّا نَزَلَتْ: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} [التكاثر: 8]، قَالَ الزُّبَيْرُ: يَا رَسُولَ اللهِ، وَأَيُّ النَّعِيمِ نُسْأَلُ عَنْهُ، وَإِنَّمَا هُمَا الْأَسْوَدَانِ التَّمْرُ وَالْمَاءُ؟ قَالَ: «أَمَا إِنَّهُ سَيَكُونُ».

[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 3356]
المزيــد ...

జుబైర్ బిన్ అవ్వామ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!) (సూరహ్: అత్-తకాథుర్ 102:8) అనే ఆయతు అవతరించినపుడు, జుబైర్ (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా పలికారు “ఓ రసూలుల్లాహ్! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది? మన వద్దనున్న రెండు నల్లని విషయాలు, ఖర్జూరాలు, నీళ్ళు; వాటి గురించా?” అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు “అవి తప్పనిసరిగా ఉంటాయి.”

[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 3356]

వివరణ

ఈ ఆయతు అవతరించినపుడు: (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!*) (సూరహ్: అత్-తకాసుర్ 102:8) – ఆ ఆయతు యొక్క అర్థము ఏమిటంటే - “అల్లాహ్ మీకు ప్రసాదించిన శుభాలు, సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు అని. అపుడు జుబైర్ ఇబ్న్ అల్ అవ్వాం రజియల్లాహు అన్హు “ఓ ప్రవక్తా! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఉన్నవే రెండు శుభాలు, అవి ప్రశ్నించబడేటంత అవసరసం ఉన్నవి కూడా కాదు; అవి ఖర్జూరాలు మరియు నీళ్ళు.” అన్నాడు.
దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఈ స్థితిలో కూడా నీవు ఉన్న సౌఖ్యాన్ని గురించి, శుభాలను గురించి ప్రశ్నించబడతావు. ఎందుకంటే అవి రెండు కూడా అల్లాహ్ ప్రసాదించిన శుభాలలో గొప్ప శుభాలు గనుక” అన్నారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ టర్కిష్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో సర్వోన్నతుడైన అల్లాహ్’కు కృతఙ్ఞతలు సమర్పించుకొనుట గురించి ఉపదేశించబడుతున్నది.
  2. తీర్పు దినమున ప్రసాదించబడిన సౌఖ్యాలను గురించి, శుభాలను గురించి దాసుడిని ప్రశ్నించడం జరుగుతుంది, అది చిన్నది అయినా లేక పెద్దది అయినా.
ఇంకా