ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వినండి! మీకు స్వర్గవాసుల గురించి తెలియజేయనా? ప్రజలు తక్కువగా చూసే ప్రతి బలహీనమైన, పేద మరియు అంతగా ఎవరికీ తెలియని వ్యక్తి; అతడు గనుక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అన్నట్లయితే, అల్లాహ్ దానిని నెరవేరుస్తాడు. వినండి! మీకు నరకవాసుల గురించి తెలియజేయనా? మదమెక్కిన ప్రతి క్రూరుడు, మూర్ఖుడు, పిసినారి మరియు గర్విష్టి నరకంలో ప్రవేశిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఉర్దూ