عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ اليَوْمَ، قَبْلَ أَلا يَكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ، وَإِلَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2449]
المزيــد ...

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైతే తన సోదరుడికి తన గౌరవం విషయంలో లేదా మరేదైనా విషయంలో అన్యాయం చేసి ఉన్నట్లైతే, అతడు ఒక దీనార్ లేదా ఒక దిర్హమ్ కూడా లేని సమయం రాకముందే అంటే ఈరోజే అతడిని (ఆ సోదరుడిని) క్షమాపణ వేడుకోవాలి. (లేకపోతే తీర్పు దినమున) అతడు మంచిపనులు చేసి ఉంటే, అతడు చేసిన తప్పుకు సమానమైన మొత్తములో అతడి మంచి పనులను తీసుకోవడం జరుగుతుంది; అతడి మంచిపనులు లేకపోతే అతని సోదరుని చెడు పనుల నుండి కొన్ని అతనిపై మోపబడతాయి."

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 2449]

వ్యాఖ్యానము

ఎవరైతే తన ముస్లిం సోదరుడికి అతడి గౌరవం, డబ్బు లేదా రక్తం విషయంలో అన్యాయం చేస్తారో, అలాంటి ప్రతి ఒక్కరూ, పునరుత్థాన దినం రాకముందే, తాను అన్యాయం చేసిన వ్యక్తిని క్షమించమని అడగాలి అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆ రోజు ఒక దీనార్ బంగారం లేదా ఒక దిర్హం వెండి తనకు తానుగా విమోచన క్రయధనంగా అంటే పరిహారంగా చెల్లించాలి అనుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ రోజు శిక్ష మంచి పనులు మరియు చెడు పనుల రూపంలో ఉంటుంది. అన్యాయానికి గురైన వ్యక్తి, తనకు జరిగిన అన్యాయానికి తగినట్టుగా, అన్యాయం చేసిన వ్యక్తి యొక్క సత్కార్యాల నుండి సత్కార్యాలను తీసూంటాడు. అన్యాయం చేసిన వ్యక్తి వద్ద సత్కార్యాలు లేకపోయినట్లైతే, అన్యాయానికి గురైన వ్యక్తి యొక్క చెడు పనులలో కొన్ని అన్యాయం చేసిన వ్యక్తిపై వేయబడతాయి.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. అన్యాయం, దౌర్జన్యం చేయకండి. వాటి పట్ల జాగరూకులై ఉండండి.
  2. ఇందులో ఇతరులపై ఉన్న ఏవైనా పరిష్కరించబడని బకాయిలు లేదా తప్పుల నుండి త్వరగా విముక్తి పొందమనే ఒక ఉద్బోధ ఉన్నది.
  3. ఇతరులకు అన్యాయం చేయడం మరియు హాని చేయడం కారణంగా ధర్మబద్ధమైన పనులు చెడిపోతాయి మరియు వాటి ప్రతిఫలం కోల్పోతారు.
  4. ప్రజల హక్కులను కాజేయడాన్ని అల్లాహ్ క్షమించడు, ఆ హక్కులను వాటి నిజమైన యజమానులకు తిరిగి చెల్లిస్తే తప్ప.
  5. దీనార్లు మరియు దిర్హమ్‌లు ఈ ప్రపంచంలో ప్రయోజనాలను పొందే సాధనాలు, కానీ తీర్పు దినాన, మంచి మరియు చెడు పనులకు బదులుగా ప్రతిఫలం లభిస్తుంది.
  6. ప్రజల గౌరవాన్ని భంగపరిచే విషయానికి సంబంధించి కొంతమంది పండితులు ఇలా అన్నారు: అన్యాయం చేయబడిన వ్యక్తికి ఆ నేరం గురించి తెలియకపోతే, అతనికి తెలియజేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక సమావేశంలో మరొక వ్యక్తిని గురించి అతని పరోక్షములో అవమానకరంగా మాట్లాడి ఉంటే, తరువాత అందుకు మనస్పూర్తిగా పశ్చాత్తాపపడితే, అతనికి జరిగిన విషయాన్ని గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే అతడు ఆ వ్యక్తి క్షమాభిక్ష కొరకు (మగ్’ఫిరత్ కొరకు) దుఆ చేయాలి, అతని మంచి కోసం ప్రార్థించాలి, మరియు ఏఏ సమావేశాలలో అయితే అతని గురించి అతని పరోక్షములో అవమానకరంగా మాట్లాడినాడో, ఆ సమావేశాలలో అతడి గురించి మంచిగా మాట్లాడాలి, అతడిని కీర్తించాలి; ఆ విధంగా తన పాపం నుండి విముక్తి పొందాలి.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (35)
ఇంకా