عن جرير بن عبد الله البجلي رضي الله عنه قال: كنا عندَ النبيِّ صلى الله عليه وسلم فنظرَ إلى القمرِ ليلةَ البدرِ، فقالَ: «إنَّكم سترون ربَّكُمْ كما تروْن هذا القمر، لاَ تُضَامُونَ في رُؤْيَته، فَإن استطعتم أنْ لاَ تُغْلَبُوا على صلاة قبل طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا، فَافْعَلُوا». وفي رواية: «فنظر إلى القمر ليلة أربع عشرة».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

జరీర్ బిన్ అబ్దుల్లా అల్ బజాలి రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మేము మహనీయ దైవప్రవక్త తో ఉన్నాము అప్పుడు పౌర్ణమి రాత్రిన చంద్రున్ని చూసాము అప్పుడు ప్రవక్త చెప్తూ అన్నారు ‘నిశ్చయంగా మీరు అతి త్వరలో మీ ప్రభువును కూడా ఈ రోజు నిండు చంద్రున్ని చూసినవిధంగానే చూస్తారు ‘ఎటువంటి తోపులాటలు లేకుండా చూస్తారు, సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు గల (ఫజర్ మరియు అసర్) నమాజులు పోకుండా సాయిశక్తుల ప్రయత్నించండి,మరో ఉల్లేఖనం ప్రకారం ‘పద్నాలుగవ తారీఖు రాత్రిన చంద్రున్ని చూశారు అని’ఉంది.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

జరీర్ బిన్ అబ్దుల్లా అల్ బజాలి రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మేము మహనీయ దైవప్రవక్త తో ఉన్నాము అప్పుడు ఆయన పౌర్ణమి రేయి-పద్నాలుగవరేయి- నిండుచంద్రున్ని చూశారు,అప్పుడు ప్రవక్త భోదించారు :‘నిశ్చయంగా అతి త్వరలో మీరు మీ ప్రభువును కూడా ఈ రేయి నిండు చంద్రున్ని చూసినవిధంగానే చూస్తారు’ దీని అర్థం మరణానంతర జీవితంలో స్వర్గంలో విశ్వాసులు అల్లాహ్ ను చూస్తారు. పౌర్ణమిని చూసినంత స్పష్టంగా ఆయనను వారు చూడగలుగుతారు.అల్లాహ్ చంద్రుడిలా ఉన్నాడని దీని అర్థం కాదు,ఎందుకంటే అల్లాహ్ ను పోలినది మరోకటి లేదు’ఆయన మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడు,కాబట్టి ఈ అనుకరణ విశ్వాసులు పరలోకతీర్పుదినాన అల్లాహ్ను చూడగల సామర్థ్యాన్ని మరియు చంద్రుడు నిండినప్పుడు చూడగల సామర్థ్యాన్ని పోల్చబడుతుంది తప్ప చూడబడుతున్న దాని గురించి కాదు,చంద్రుడు నిండినప్పుడు స్పష్టంగా మరియు ప్రత్యక్షంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లే, మన ప్రభువును కూడా మన కళ్ళతో ఎటువంటి సందేహం లేకుండా చూస్తాము. స్వర్గ నివాసితులు ఆనందించే అన్నీ అనుగ్రహాలలో ఉత్తమమైనది మరియు అత్యంత ప్రియమైనది అల్లాహ్ ముఖాన్ని చూడటం;దానికి సమానం ఏమీ లేదు,మహనీయ అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా అన్నారు:"సూర్యోదయానికి ముందు (ఫజ్ర్) నమాజు మరియు సూర్యాస్తమయం ముందు('అస్ర్) నమాజు పాటించడంలో అధిగమించగలిగితే అలా చేయండి” ఈ "استطعتم ألا تغلبوا على صلاة"అర్ధం: మీరు వాటిని సంపూర్ణంగా పాటించగలగడం’-అందులో ఒకటి జమాతు తో పాటు నమాజు ఆచరించడం,మహోన్నతుడు గొప్పవాడు అయిన అల్లాహ్ ముఖాన్ని చూడటానికి దారితీసే మార్గాలలో ఫజ్ర్ మరియు ‘అస్ర్ నమాజులను క్రమం తప్పకుండా పాటించడం ఒకటి అని ఈ హదీసు రుజువు చేస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఒక యూదకుర్రాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు సేవ చేస్తూ ఉండేవాడు.
  2. విశ్వాసులు ప్రళయదినాన మహోన్నతుడైన అల్లాహ్ ను చూడబోతున్నారన్న శుభవార్తను ఈ హదీసు ప్రమాణపరుస్తుంది.
  3. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా’ వాస్తవంగా చూస్తారని’నిరూపించబడుతుంది,అహ్లు తావీల్ మరియు అహ్లు తాతీల్’అభిప్రాయాన్ని ఖండిస్తుంది.
  4. ఫజర్ మరియు అసర్ రెండు నమాజులకు గొప్ప ప్రాధాన్యత ఉంది,కాబట్టి శక్తిమేరకు వాటిని సంరక్షించుకోవాలి.
  5. ఈ రెండువేళలు దైవదూతల సమీకరణ కొరకు మరియు వారి కార్యాలను ఎత్తుకెళ్లుటకు ప్రత్యేకించబడినవి,తద్వారా వారు ఈ గొప్ప ఘనతను కోల్పోకుండా ఉంటారు.
  6. దావాహ్ మాధ్యమాలలో ఒకటి తాకీదు మరియు ప్రోత్సాహం.
ఇంకా