عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّمَا مَثَلُ صَاحِبِ القُرْآنِ كَمَثَلِ صَاحِبِ الإِبِلِ المُعَقَّلَةِ، إِنْ عَاهَدَ عَلَيْهَا أَمْسَكَهَا، وَإِنْ أَطْلَقَهَا ذَهَبَتْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5031]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5031]
ఈ హదీథులో - ఖుర్’ఆన్ ను అధ్యయనం చేసిన వ్యక్తిని – అది ముస్’హఫ్ ను (ఖుర్’ఆన్ యొక్క ప్రతిని) చూసి చదవడం ద్వారా కావచ్చు, లేక ఖుర్’ఆన్ ను కంఠస్థం చేయడం ద్వారా కావచ్చు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మోకాళ్ళను తాడుతో కట్టిన ఒంటె యజమానితో పోల్చారు. అతను దానిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను దానిని తన అధీనంలో ఉంచుకుంటాడు, కానీ అతను దాని తాడును విప్పితే, అది తప్పించుకుని వెళ్ళిపోతుంది. అదే విధంగా ఖుర్’ఆన్ సహచరుడు తాను అధ్యయనం చేసిన దానిపై, లేక తాను కంఠస్థం చేసిన దానిపై స్థిరంగా ఉంటే అతడు దానిని గుర్తుంచుకుంటాడు; మరియు అతను దానిని నిర్లక్ష్యం చేస్తే, అతను దానిని మరచిపోతాడు. కనుక ఖుర్’ఆన్ తో సంబంధం క్రమం తప్పకుండా నిర్వహించబడినంత వరకు, కంఠస్థం చెక్కుచెదరకుండా ఉంటుంది.